క్రిష్ బండిపల్లి, మీరా కన్నన్, దీక్ష హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా ‘లవ్వాట’. నిడిగంటి సాయిరాజేష్ మూవీస్ పతాకంపై ఎన్. వెంకటేశ్వర్లు, బొట్టా శంకర్రావు, వెంకటగిరి శ్రీనివాస్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఆర్కే గాంధీ దర్శకుడు. తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో రూపొందుతున్న ఈ చిత్ర టైటిల్ను తాజాగా హైదరాబాద్లో ప్రకటించారు.
ఈ సందర్భంగా దర్శకుడు ఆర్కే గాంధీ మాట్లాడుతూ..‘ప్రేమ పట్ల నేటి యువత ఆలోచనలు ఎలా ఉన్నాయో చెప్పే చిత్రమిది. రొమాంటిక్ ఎంటర్టైనర్గా తెరకెక్కిస్తున్నాం. వచ్చే నెల 22వ తేదీ నుంచి శ్రీకాకుళం, మిర్యాలగూడ, హైదరాబాద్లో షూటింగ్ చేయబోతున్నాం. త్రిభాషా చిత్రంగా మెప్పిస్తామని ఆశిస్తున్నాం’ అన్నారు.