‘మీటర్’.. యాక్షన్ ఎంటర్టైనర్
యువ హీరో కిరణ్ అబ్బవరం నటిస్తున్న తాజా చిత్రం ‘మీటర్'. రమేష్ కాదూరి దర్శకుడు. మైత్రీ మూవీ మేకర్స్ సమర్పణలో క్లాప్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై చిరంజీవి (చెర్రి), హేమలత పెద్దమల్లు నిర్మిస్తున్నారు.
యువ హీరో కిరణ్ అబ్బవరం నటిస్తున్న తాజా చిత్రం ‘మీటర్’. రమేష్ కాదూరి దర్శకుడు. మైత్రీ మూవీ మేకర్స్ సమర్పణలో క్లాప్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై చిరంజీవి (చెర్రి), హేమలత పెద్దమల్లు నిర్మిస్తున్నారు. ఏప్రిల్ 7న చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా చిత్ర టీజర్‌ను హైదరాబాద్‌లో విడుదల చేశారు. నిర్మాత చిరంజీవి (చెర్రి) మాట్లాడుతూ…‘మా క్లాప్ ఎంటర్టైన్మెంట్స్ సంస్థలో ఇప్పటిదాకా ప్రయోగాత్మక చిత్రాలను నిర్మిస్తూ వచ్చాం. ఈ కథ వినగానే ఒక పక్కా కమర్షియల్ సినిమా ఎందుకు నిర్మించకూడదు అనిపించింది. అలా ‘మీటర్’ సినిమాను నిర్మించాం. ఇది కిరణ్ అబ్బవరం కెరీర్లో హై బడ్జెట్ మూవీ అవుతుంది.
టీజర్ ఎంత స్పీడ్‌గా ఉందో సినిమా కూడా అంతే రేసీగా ఉంటుంది. కిరణ్ అబ్బవరంకు ఔట్ అండ్ ఔట్ మాస్ క్యారెక్టర్ ఇది’ అన్నారు. దర్శకుడు రమేష్ కాదూరి మాట్లాడుతూ…‘ ఈ సినిమా పెద్ద హిట్ అవుతుందనే నమ్మకంతో టీమ్ అంతా ఉన్నాం’ అన్నారు. హీరో కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ…‘ఒక స్టార్ హీరో చేయాల్సిన కథ ఇది. యువ హీరోలకు రిస్క్ లాంటిదీ స్టోరి. ఎందుకంటే హై మూవ్మెంట్స్, యాక్షన్ ఎపిసోడ్స్ ఉంటాయి. నేను థియేటర్లో ఎలాంటి సినిమాలు చూసి విజిల్స్ వేశానో అలా ఉంటుంది. ఒకటికి పది సార్లు ఆలోచించుకున్న తర్వాత ఈ సినిమా చేసేందుకు నిర్ణయం తీసుకున్నాను. సినిమా ఆద్యంతం ఎంజాయ్ చేస్తారు’ అన్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Chiranjeevi | మెగాస్టార్‌గా ఎదగడానికి కారణం అదే.. బీర్ తాగమని ఫ్రెండ్స్ ఒత్తిడి చేసినా నో చెప్పా: చిరంజీవి
Khammam Road Accident | గ్రీన్‌ఫీల్డ్ హైవేపై ఆగివున్న లారీని ఢీకొన్న ప్రైవేటు బస్సు.. 10 మంది ప్రయాణికులకు గాయాలు
Varanasi | వారణాసి రిలీజ్‌పై మళ్లీ సస్పెన్స్.. రాజమౌళి ఒక్క మాటతో ఫ్యాన్స్‌లో కొత్త టెన్షన్!
Naveen Polishetty | నవీన్ పొలిశెట్టిపై అభిమానుల అసహనం.. ఇంతకాలం సైలెన్స్ వెనుక కారణమేంటి?
Ind vs Nz | అదరగొట్టిన ఆకాశ్ దీప్.. న్యూజిలాండ్ 356 ఆలౌట్, ఐదు వికెట్లతో చెలరేగిన భారత పేసర్
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

