Kiara Advani First Bikini Shot | బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్, టాలీవుడ్ అగ్ర కథానాయకుడు ఎన్టీఆర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం వార్ 2. ఈ సినిమాకు బ్రహ్మస్త్ర దర్శకుడు అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నాడు. నేడు ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా వార్ 2 టీజర్‌ను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈరోజు ఉదయం విడుదలైన ఈ టీజర్ మిలియన్స వ్యూస్‌తో దూసుకుపోతుంది. అయితే ఈ టీజర్ వైరలవ్వడానికి మరో ముఖ్య కారణం ఇందులో నటి కియారా అద్వానీ బికినీలో నటించడం. బికినీలో కియారా మొదటిసారి కనిపించడంతో ప్రస్తుతం సోషల్ మీడియా అంతటా ట్రెండింగ్‌గా మారింది.
మరోవైపు వార్ 2 టీజర్‌పై స్పెషల్ పోస్ట్ పెట్టింది కియారా. ఈ సినిమా తన కెరీర్లో అనేక మొదటి అనుభవాలను అందించిందని కియారా అద్వానీ పంచుకుంది. యష్ రాజ్ ఫిలింస్‌తో ఇది తన మొదటి సినిమా అని, అలాగే తన మొదటి యాక్షన్ సినిమా అని ఆమె పేర్కొంది. హృతిక్ రోషన్ మరియు జూనియర్ ఎన్టీఆర్ వంటి గొప్ప నటులతో, దర్శకుడు అయాన్ ముఖర్జీతో కలిసి పనిచేయడం కూడా ఇదే తొలిసారి అని కియారా వెల్లడించింది. అన్నింటికీ మించి, టీజర్లో తాను బికినీలో కనిపించడం కూడా ఇదే తొలిసారి అని కియారా చెప్పడం విశేషం.
Lots of firsts
First @yrf film 🥹
First action film 👩🏻✈️
First with @iHrithik @tarak9999 🔥😍
First collaboration with Ayan🎬
And ofcourse First bikini shot 🧜♀️Here’s the #War2teaser hope we’ve got you excited for the 14th of August #War2 releasing in theatres in Hindi, Telugu… pic.twitter.com/L6z6nwjZlV
— Kiara Advani (@advani_kiara) May 20, 2025