‘ఖిలాడి’తో చెట్టపట్టాల్
‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’ సినిమాతో మీనాక్షి చౌదరి, ‘సామాన్యుడు’ చిత్రంతో డింపుల్ హయతి తెలుగు ప్రేక్షకులకు నాయికలుగా పరిచయం అయ్యారు. స్టార్ హీరో రవితేజ సరసన వీళ్లిద్దరు నటించిన కొత్త సినిమా ‘ఖిలాడి’. పెన్ స్టూడియోస్, ఏ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించాయి. కోనేరు సత్యనారాయణ నిర్మాత. రమేష్ వర్మ దర్శకుడు. సినిమాలో అందంతో పాటు నటనలోనూ మెప్పిస్తాంటున్నారు మీనాక్షి, డింపుల్
‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’ సినిమాతో మీనాక్షి చౌదరి, ‘సామాన్యుడు’ చిత్రంతో డింపుల్ హయతి తెలుగు ప్రేక్షకులకు నాయికలుగా పరిచయం అయ్యారు. స్టార్ హీరో రవితేజ సరసన వీళ్లిద్దరు నటించిన కొత్త సినిమా ‘ఖిలాడి’. పెన్ స్టూడియోస్, ఏ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించాయి. కోనేరు సత్యనారాయణ నిర్మాత. రమేష్ వర్మ దర్శకుడు. సినిమాలో అందంతో పాటు నటనలోనూ మెప్పిస్తాంటున్నారు మీనాక్షి, డింపుల్. ‘ఖిలాడి’ సినిమా ఈ నెల 11న విడుదలవుతున్న సందర్భంగా చిత్రంతో పాటు తమ క్యారెక్టర్ విశేషాలు తెలిపారు.
నాకిది పెద్ద అవకాశం: మీనాక్షి చౌదరి
రెండో చిత్రమే రవితేజ సరసన నటించడం నాకు పెద్ద అవకాశం. ఇద్దరు నాయికలు ఉన్నారని ఆలోచించలేదు. నా పాత్ర కథలో ఎంత కీలకంగా ఉంటుంది అనేదే ప్రాధాన్యంగా తీసుకున్నాను. తెలుగు భాష తెలియదు. అయినా రవితేజ సహా ఇతర నటీనటులు సహకారం అందించారు. రొమాంటిక్ సన్నివేశాలు కూడా నటనలో ఒక భాగమే. ‘ఖిలాడి’ కంప్లీట్ యాక్షన్ ఎంటర్ టైనర్. భారీ తారాగణం, అత్యున్నత స్థాయి రూపకల్పనతో ఆకట్టుకుంటుంది. నేను ‘సలార్’ చిత్రంలో నటిస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. కానీ ఏదీ ఖరారు కాలేదు. ‘హిట్ 2’ సినిమాలో నటిస్తున్నాను. తమిళంలో విజయ్ ఆంటోనీ సరసన ‘కొలై’ అనే చిత్రంలో నటించాను’ అని అన్నారు.
లంగావోణిలో మురిపిస్తా: డింపుల్ హయతి
తెలుగులో నా మొదటి సినిమా ‘గద్దలకొండ గణేష్’ లో ప్రత్యేక గీతంలో నటించాను. ఆ తర్వాత అలాంటి పాటలే చేయమని అడిగారు. కానీ నాకు నటిగా పేరు తెచ్చుకోవాలని ఉండేది. ఈ సమయంలో ‘ఖిలాడి’ అవకాశం రావడం నిజంగా అదృష్టంగా భావిస్తున్నా. దర్శకుడు రమేష్ వర్మ కథ వినిపించారు. ఇందులో రెండు పాత్రలు ఉంటాయి. నీకు నచ్చింది ఎంచుకో అన్నారు. హీరోకు సమానంగా ఉండే కీలకపాత్ర నాది అన్నప్పుడు సంతోషం కలిగింది. సినిమాకు ముందు నేను కొంచెం బొద్దుగా ఉండేదాన్ని. ఓ పాటకోసం రెండు వారాల్లో ఆరు కిలోలు బరువు తగ్గాలన్నారు. లంగావోణీలో, మోడరన్ దుస్తుల్లో ఆకట్టుకుంటాను. తెలుగు, తమిళంలో కొన్ని ప్రాజెక్ట్స్ చర్చల దశలో ఉన్నాయి. అవి ఆ నిర్మాతలే ప్రకటిస్తారు. అన్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Donald Trump | రష్యా- అమెరికా డీజిల్ ఒప్పందాన్ని తప్పుబట్టిన జెలెన్స్కీ.. ఉక్రెయిన్‌కు కొత్త అధ్యక్షుడు అవసరమన్న ట్రంప్
Bathukamma | బతుకమ్మ పండుగకు కనీస ఏర్పాట్లు చేయని కాంగ్రెస్ సర్కార్.. వీడియో
Patnam Narendar Reddy | పట్టభద్రులు ఓటర్ల జాబితాలో తమ పేర్లను నమోదు చేయించుకోవాలి : మాజీ ఎమ్మెల్యే పట్నం
Maganur | షార్ట్ సర్య్కూట్‌తో ఇళ్లు దగ్ధం..పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే
Chennai Metro | చెన్నైలో మెట్రో నూతన మార్గం ప్రారంభం.. ప్రధాని మోదీ, సీఎం విజయ్ తొలి ప్రయాణం..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

