Keerthy Suresh | పరిధులను పక్కన పెట్టేసింది..
పోటీ ప్రపంచంలో దూసుకుపోవాలంటే కష్టమైనా.. ఇష్టం లేకపోయినా కొన్ని చేయాల్సిందే. సినిమా రంగంలో మరీనూ. కొందరు హీరోయిన్ల విషయంలో ప్రేక్షకుల దృక్కోణం ఒకలా ఉంటుంది. కానీ ఆ హీరోయిన్లే ఒక్కోసారి ఊహించని ట్విస్టులిచ్చి.. మింగుడుపడని షాకులిస్తున్నారు.
పోటీ ప్రపంచంలో దూసుకుపోవాలంటే కష్టమైనా.. ఇష్టం లేకపోయినా కొన్ని చేయాల్సిందే. సినిమా రంగంలో మరీనూ. కొందరు హీరోయిన్ల విషయంలో ప్రేక్షకుల దృక్కోణం ఒకలా ఉంటుంది. కానీ ఆ హీరోయిన్లే ఒక్కోసారి ఊహించని ట్విస్టులిచ్చి.. మింగుడుపడని షాకులిస్తున్నారు. కూటికోసం కోటి విద్యలు అన్నట్టు. కెరీర్ ప్రారంభం నుంచి డీసెంట్‌గా కనిపించింది కీర్తీసురేశ్. ఇక ‘మహానటి’ చేసిన తర్వాత ఆమె ఇమేజే మారిపోయింది. దానికితోడు జాతీయ ఉత్తమనటి అనే ట్యాగు.
ఈ బరువును పరువుగా మోయడం అంటే కష్టమే. కెరీర్ పల్టీ కొట్టే ప్రమాదం లేకపోలేదు. అందుకు తగ్గట్టే చేసిన లేడీ ఓరియెంటెడ్ సినిమాలన్నీ చేదు అనుభవాలే మిగిల్చాయి. ఇక తప్పేది లేక మహేశ్ ‘సర్కారువారిపాట’తో పరిధుల్ని పక్కన పెట్టేసింది. కాస్త గ్లామర్ డోస్ పెంచి యువతరానికి అందాల ట్రీట్ ఇచ్చేసింది. మహానటి ఈ కొత్త అవతారం చూసి షాక్‌కి గురైన ప్రేక్షకులు కూడా లేకపోలేదు.
లేటెస్ట్ న్యూస్ ఏంటంటే.. అధర చుంబనానికి కూడా సై అనేసింట ఈ అందాల భామ. కాకపోతే ఆ అదృష్టాన్ని మాత్రం ఉత్తరాది హీరోకి ఇచ్చేసిందట. ఎవరా హీరో అనుకుంటున్నారా? ప్రస్తుతం బాలీవుడ్లో ‘బేజీ జాన్’ అనే సినిమా చేస్తున్నది కీర్తిసురేశ్. ఆ సినిమాలో వరుణ్ ధావన్ హీరో. కథ, సన్నివేశం డిమాండ్ మేరకు ఆ సినిమాలో ముద్దు సన్నివేశం అనివార్యమైందట. దాంతో పాత్ర కోసం వరుణ్‌తో పెదవి ముద్దుకి ‘సరే’ అనేసిందట కీర్తి. ఏదేమైనా యూత్‌కి ఇదో కొత్త అనుభవం. రేపు ఈ సినిమా సీన్ కోసమే థియేటర్లు ఫుల్ అవుతాయనడంలో అతిశయోక్తి లేదు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vice President | శ్రీవారిని దర్శించుకున్న భారత ఉప రాష్ట్రపతి
లక్ష్మీపురంలో గ్రామ మహిళా సంఘ భవనం ప్రారంభం
Jobs | డిగ్రీ అర్హతతో రైల్వేలో 1250 స్టేషన్ మాస్టర్ పోస్టులు.. నవంబర్ 25 చివరితేదీ
Boy Fakes Kidnap | తండ్రి నుంచి రూ.5 లక్షలు వసూలు చేసేందుకు.. కిడ్నాప్ నాటకం ఆడిన యువకుడు
కోట మైసమ్మ జాతర ఆదాయం రూ.32,02,697
ట్రెండింగ్ వార్తలు
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?

