Keerthy Suresh | వచ్చే నెలలో లగ్గం.. జీవితాంతం తమ బంధం కొనసాగుతుంది: కీర్తి సురేష్
ఇటీవలే తన రిలేషన్షిప్ స్టేటస్‌పై ఇన్స్టాగ్రామ్ వేదికగా క్లారిటీనిచ్చింది అగ్ర కథానాయిక కీర్తి సురేష్. చిరకాల స్నేహితుడు ఆంటోనితో ప్రేమలో ఉన్నానని, ఇక జీవితాంతం తమ బంధం కొనసాగుతుందని వెల్లడించింది. దీంతో ఈ భామ పెళ్లిపీటలెక్కేందుకు సిద్ధమవుతున్నదని అభిమానులు భావించారు.
Keerthy Suresh | ఇటీవలే తన రిలేషన్షిప్ స్టేటస్‌పై ఇన్స్టాగ్రామ్ వేదికగా క్లారిటీనిచ్చింది అగ్ర కథానాయిక కీర్తి సురేష్. చిరకాల స్నేహితుడు ఆంటోనితో ప్రేమలో ఉన్నానని, ఇక జీవితాంతం తమ బంధం కొనసాగుతుందని వెల్లడించింది. దీంతో ఈ భామ పెళ్లిపీటలెక్కేందుకు సిద్ధమవుతున్నదని అభిమానులు భావించారు. శుక్రవారం కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్న కీర్తి సురేష్ అక్కడే తన పెళ్లి వివరాలను తెలియజేసింది.
వచ్చే నెలలో గోవాలో పెళ్లి చేసుకోబోతున్నానని చెప్పింది. తన తాజా హిందీ చిత్రం ‘బేబీ జా న్’ త్వరలో విడుదలకానుందని, అందుకే స్వామివారిని దర్శించుకున్నానని కీర్తి సురేష్ పేర్కొంది. దక్షిణాది అగ్ర కథానాయికల్లో ఒకరైన కీర్తి సురేష్ ‘బేబీ జాన్’ చిత్రం ద్వారా బాలీవుడ్‌లోకి అడుగుపెడుతున్నది. వరుణ్‌ధావన్ కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రం డిసెంబర్ 25న ప్రేక్షకుల ముందుకురానుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

