Kaala Bhairava | సస్పెన్స్‌కు తెర.. సింగర్ కాల భైరవతో ప్రేమలో ఉన్నట్టు అధికారికంగా ప్రకటించిన కావ్య కల్యాణ్‌రామ్!
Kaala Bhairava | టాలీవుడ్లో యంగ్ హీరోయిన్గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న కావ్య కల్యాణ్‌రామ్ ఎట్టకేలకు తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన కీలక విషయాన్ని అధికారికంగా వెల్లడించారు. కొంతకాలంగా ప్రముఖ సింగర్, మ్యూజిక్ కంపోజర్ కాల భైరవతో ఆమె ప్రేమలో ఉన్నారంటూ సోషల్ మీడియాలో వార్తలు, ఊహాగానాలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే.
Kaala Bhairava | టాలీవుడ్లో యంగ్ హీరోయిన్గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న కావ్య కల్యాణ్‌రామ్ ఎట్టకేలకు తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన కీలక విషయాన్ని అధికారికంగా వెల్లడించారు. కొంతకాలంగా ప్రముఖ సింగర్, మ్యూజిక్ కంపోజర్ కాల భైరవతో ఆమె ప్రేమలో ఉన్నారంటూ సోషల్ మీడియాలో వార్తలు, ఊహాగానాలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పటివరకు వీరిద్దరూ తమ రిలేషన్‌షిప్‌పై నేరుగా స్పందించలేదు. తాజాగా కావ్య చేసిన ఓ సోషల్ మీడియా పోస్ట్‌తో ఈ సస్పెన్స్‌కు తెరపడింది.ఆగస్టు 31న కావ్య కల్యాణ్‌రామ్ తన సోషల్ మీడియా వేదికగా ఓ ప్రత్యేకమైన ఫొటోను షేర్ చేస్తూ తన రిలేషన్‌షిప్‌ను అధికారికంగా ప్రకటించారు.
“Life update: I found My Yellow Paper Daisy” అంటూ ఆమె పెట్టిన క్యాప్షన్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ పోస్ట్ ద్వారా కాల భైరవే తన జీవితంలో ప్రత్యేకమైన వ్యక్తి అని కావ్య చెప్పకనే చెప్పారు. కాల భైరవ గురించి కావ్య తన పోస్ట్‌లో ఎంతో ప్రేమగా, భావోద్వేగంగా రాసుకొచ్చారు. కొంతమంది వ్యక్తులు మన జీవితంలోకి వచ్చిన తర్వాత మనం దేవుడికి ఎంతో ఇష్టమైన బిడ్డలమనే భావన కలిగిస్తారని పేర్కొన్నారు. అలాగే జీవితంలో సరైన వ్యక్తి ఎదురైనప్పుడు ‘రోజ్-టింటెడ్ గ్లాసెస్’ పెట్టుకుని ప్రపంచాన్ని చూడటం కూడా అంత చెడ్డ విషయం కాదంటూ తన ప్రేమను వ్యక్తం చేశారు. తన సాధారణమైన రోజులను సైతం ప్రత్యేకంగా మార్చినందుకు భైరవకు కావ్య కృతజ్ఞతలు తెలిపారు. ఆయన వల్ల తాను ప్రపంచంలోనే అత్యంత అదృష్టవంతురాలిగా ఫీల్ అవుతున్నానని పేర్కొన్నారు. దీంతో వీరిద్దరి మధ్య ఉన్న బంధం ఎంత ప్రత్యేకమైనదో ఆమె పోస్ట్ ద్వారా స్పష్టమైంది.
అంతేకాదు.. తనకు డైట్ కోక్ కావాలని చెప్పి, ఆ తర్వాత వద్దని చెప్పినా కూడా తనకు అది కావాలని గుర్తుపెట్టుకునేంత కాలం భైరవ తన జీవితంలో ఉండాలని సరదాగా కోరుకున్నారు. ఈ మాటలు కూడా నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి. కావ్య కల్యాణ్‌రామ్, కాల భైరవ ప్రేమలో ఉన్నారనే వార్తలు గత కొంతకాలంగా టాలీవుడ్ వర్గాల్లో చక్కర్లు కొడుతున్నాయి. ముఖ్యంగా ఈ ఏడాది వీరిద్దరూ కొన్ని సందర్భాల్లో కలిసి కనిపించడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరింది. హైదరాబాద్‌లో జరిగిన ఓ పుస్తకావిష్కరణ కార్యక్రమానికి కూడా కావ్య, భైరవ కలిసి హాజరైనట్టు అప్పట్లో వార్తలు వచ్చాయి. అప్పటి నుంచి వీరిద్దరి మధ్య స్నేహానికి మించి ఏదో ఉందనే చర్చ సోషల్ మీడియాలో మొదలైంది. అయితే ఆ సమయంలో తమ బంధంపై ఇద్దరూ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.ఇప్పుడు కావ్య స్వయంగా సోషల్ మీడియాలో చేసిన ఈ పోస్ట్‌తో ఇన్ని రోజులుగా కొనసాగుతున్న ఊహాగానాలకు ఫుల్స్టాప్ పడింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Chiranjeevi | మెగాస్టార్‌గా ఎదగడానికి కారణం అదే.. బీర్ తాగమని ఫ్రెండ్స్ ఒత్తిడి చేసినా నో చెప్పా: చిరంజీవి
Khammam Road Accident | గ్రీన్‌ఫీల్డ్ హైవేపై ఆగివున్న లారీని ఢీకొన్న ప్రైవేటు బస్సు.. 10 మంది ప్రయాణికులకు గాయాలు
Varanasi | వారణాసి రిలీజ్‌పై మళ్లీ సస్పెన్స్.. రాజమౌళి ఒక్క మాటతో ఫ్యాన్స్‌లో కొత్త టెన్షన్!
Naveen Polishetty | నవీన్ పొలిశెట్టిపై అభిమానుల అసహనం.. ఇంతకాలం సైలెన్స్ వెనుక కారణమేంటి?
Ind vs Nz | అదరగొట్టిన ఆకాశ్ దీప్.. న్యూజిలాండ్ 356 ఆలౌట్, ఐదు వికెట్లతో చెలరేగిన భారత పేసర్
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

