‘ఆపరేషన్ సిందూర్’లో కార్తీక్ ఆర్యన్
2025 ఏప్రిల్ జమ్మూ కశ్మీర్ పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడి అనంతరం భారత ప్రభుత్వం ‘ఆపరేషన్ సిందూర్' పేరుతో సైనిక ఆపరేషన్‌ను చేపట్టిన విషయం తెలిసిందే. ఈ సంఘటన నేపథ్యంలో బాలీవుడ్ దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి ‘ఆపరేషన్ సిందూర్' చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారు.
2025 ఏప్రిల్ జమ్మూ కశ్మీర్ పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడి అనంతరం భారత ప్రభుత్వం ‘ఆపరేషన్ సిందూర్’ పేరుతో సైనిక ఆపరేషన్‌ను చేపట్టిన విషయం తెలిసిందే. ఈ సంఘటన నేపథ్యంలో బాలీవుడ్ దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి ‘ఆపరేషన్ సిందూర్’ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారు. ఈ ఏడాది మార్చిలోనే ఈ ప్రాజెక్ట్‌ను ప్రకటించారు. తాజాగా ఈ సినిమాలో కార్తీన్ ఆర్యన్ కథానాయకుడిగా నటించనున్నట్లు సమాచారం.
త్వరలో ఈ విషయమై అధికారిక ప్రకటన రానుందని తెలిసింది. లెఫ్టినెంట్ జనరల్ కేజేఎస్ టైనీ ధిల్లాన్ రచించిన ‘ఆపరేషన్ సిందూర్: ది అన్‌టోల్డ్ స్టోరీ ఆఫ్ డీప్ స్ట్రైక్స్ ఇన్సైడ్ పాకిస్తాన్’ పుస్తకం ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. భారత సాయుధ దళాలకు చెందిన వివిధ విభాగాలతో కలిసి క్షేత్రస్థాయిలో విస్త్రత పరిశోధన చేసి ఈ కథను సిద్ధం చేసినట్లు దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి వెల్లడించారు. ప్రస్తుతం కార్తీక్ ఆర్యన్ ‘కెప్టెన్ ఇండియా’ చిత్రంలో నటిస్తున్నారు. యెమెన్‌లోని హోతీ సంఘర్షణల నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

