కట్నం కోసం వేధింపులు.. సీనియర్ నటికి రెండేళ్లు జైలు శిక్ష..!
Kannada actor Abhinaya | కన్నడ సీనియర్ నటి అభినయ సోదరుడు శ్రీనివాస్ 1998లో లక్ష్మీదేవి అనే యువతిని వివాహం చేసుకున్నాడు. వివాహ సమయంలో లక్ష్మీదేవి నుంచి శ్రీనివాస్ కట్న కానుకల కింద రూ.80వేలు డబ్బు, కొంత బంగారం తీసుకున్నాడు. కాగా, వివాహం అనంతరం అదనపు కట్నం తీసుకురావాలని శ్రీనివాస్ కుటుంబం బాధిత మహిళను డిమాండ్ చేశారు. దీంతో విసుగు చెందిన లక్ష్మీదేవి 2002లో భర్త, అత్తమామలు సహా అభినయపై బెంగళూరు చంద్ర లేఔట్ పీఎస్‌లో ఫిర్యాదు చేసింది. రూ. లక్ష తీసుకురావాలని నటి అభినయ తనను శారీరకంగా, మానసికంగా వేధించారని ఫిర్యాదులో పేర్కొంది.
Kannada actor Abhinaya | కట్నం కోసం వదినను వేధించిన ఓ సీనియర్ నటి చివరకు కటకటాల పాలైంది. ఆమెపై వచ్చిన వేధింపుల ఆరోపణలు రుజువు కావడంతో ఉన్నత న్యాయస్థానం రెండేళ్లు జైలు శిక్ష విధించింది. నటితోపాటు ఆమె కుటుంబ సభ్యులకు సైతం శిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చింది.
కన్నడ సీనియర్ నటి అభినయ సోదరుడు శ్రీనివాస్ 1998లో లక్ష్మీదేవి అనే యువతిని వివాహం చేసుకున్నాడు. వివాహ సమయంలో లక్ష్మీదేవి నుంచి శ్రీనివాస్ కట్న కానుకల కింద రూ.80వేలు డబ్బు, కొంత బంగారం తీసుకున్నాడు. కాగా, వివాహం అనంతరం అదనపు కట్నం తీసుకురావాలని శ్రీనివాస్ కుటుంబం బాధిత మహిళను డిమాండ్ చేశారు. దీంతో విసుగు చెందిన లక్ష్మీదేవి 2002లో భర్త, అత్తమామలు సహా అభినయపై బెంగళూరు చంద్ర లేఔట్ పీఎస్‌లో ఫిర్యాదు చేసింది. రూ. లక్ష తీసుకురావాలని నటి అభినయ తనను శారీరకంగా, మానసికంగా వేధించారని ఫిర్యాదులో పేర్కొంది.
ఈ కేసు విచారణలో భాగంగా.. నేరం రుజువైనట్లు హైకోర్టు పేర్కొంది. ఈ మేరకు అభినయకు రెండేళ్ల కారాగార శిక్షను ఖరారు చేస్తూ ఉన్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. ఆమె సోదరుడు శ్రీనివాస్‌కు మూడేళ్లు, ఆమె తల్లి జయమ్మకు ఐదేళ్లు, మరో సోదరుడు చెలువరాజుకు రెండేళ్లు శిక్షను విధిస్తూ జడ్జి జస్టిస్ హెచ్‌బీ ప్రభాకర్శాస్త్రి బుధవారం తీర్పు ఇచ్చారు. కోర్టు తీర్పుపట్ల లక్ష్మీదేవి సంతోషం వ్యక్తం చేశారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
MLA KP Vivekananda | నీళ్లన్నీ వృధాగా పోతున్నయ్.. మేం కళ్లారా చూసినం : ఎమ్మెల్యే కేపీ వివేకానంద
Vaibhav Sooryavanshi: నిరాశపరిచిన సూర్యవంశీ.. ఇండియా 70/5
Coffee Benefits | రోజూ కాఫీ తాగుతున్నారా? ఈ 5 ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకోండి!
Rahul Gandhi | నవంబర్ 1న జరిగే ర్యాలీని వాయిదా వేసుకోండి.. రాహుల్ గాంధీకి వ్యాపార సంఘాల వినతి
Sonia Gandhi: కేంబ్రిడ్జ్ వర్సిటీలో రాజీవ్ గాంధీతో ప్రేమ ప్రయాణం: సోనియా గాంధీ
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

