డార్క్‌సైడ్ ఆఫ్ గ్రేట్ పీపుల్
‘కాంత’ చాలా అరుదైన చిత్రమని, ఇలాంటి సినిమాలు జీవితంలో ఒక్కసారే వస్తాయని చెప్పారు కథానాయకులు దుల్కర్ సల్మాన్, రానా. వారిద్దరూ ప్రధాన పాత్రల్లో నటిస్తూ, నిర్మించిన సినిమా నేపథ్య పీరియాడిక్ డ్రామా ‘కాంత’. సెల్వమణి సెల్వరాజ్ దర్శకుడు. ఈ నెల 14న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సందర్భంగా బుధవారం హీరోలు దుల్కర్ సల్మాన్, రానా విలేకరులతో ముచ్చటించారు.
‘కాంత’ చాలా అరుదైన చిత్రమని, ఇలాంటి సినిమాలు జీవితంలో ఒక్కసారే వస్తాయని చెప్పారు కథానాయకులు దుల్కర్ సల్మాన్, రానా. వారిద్దరూ ప్రధాన పాత్రల్లో నటిస్తూ, నిర్మించిన సినిమా నేపథ్య పీరియాడిక్ డ్రామా ‘కాంత’. సెల్వమణి సెల్వరాజ్ దర్శకుడు. ఈ నెల 14న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సందర్భంగా బుధవారం హీరోలు దుల్కర్ సల్మాన్, రానా విలేకరులతో ముచ్చటించారు. రానా మాట్లాడుతూ ‘పూర్తి ఫిక్షనల్ కథ ఇది. 1950 నాటి సంఘటనల నుంచి స్ఫూర్తిపొంది రాశారు. ఇద్దరు వ్యక్తులు వాళ్ల ఆర్టిస్టిక్ బ్రిలియన్స్ కోసం గొడవలు పడిన నేపథ్యం ఆసక్తినిరేకెత్తిస్తుంది. డార్క్‌సైడ్ ఆఫ్ గ్రేట్ పీపుల్‌గా ఈ కథను చెప్పొచ్చు. 1950 కాలంలో సంగీతం, సాహిత్యానికి చాలా ప్రాధాన్యం ఉండేది.
కళలో పరిణితి కనిపించేది. అందుకే ఆ కాలాన్ని ఎంచుకున్నాం. నా దృష్టిలో సినిమా మాత్రమే కాలాన్ని రీక్రియేట్ చేయగలదు. ఈ సినిమా కోసం అప్పటి కాలమాన పరిస్థితుల్ని రీక్రియేట్ చేశాం. ఈ కథ విన్న వెంటనే దుల్కర్ సల్మాన్ పర్ఫెక్ట్ ఛాయిస్ అనిపించింది’ అన్నారు. దుల్కర్ సల్మాన్ మాట్లాడుతూ ‘ఈ సినిమా నా జీవితంలో చాలా స్పెషల్. ఈ కథ విన్నప్పుడే రానాతో కలిసి తప్పకుండా ఈ సినిమా చేయాలనుకున్నా. 50ల నాటి కథ కాబట్టి పాటలు, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సరికొత్త ఫీల్‌ను కలిగిస్తాయి. నేను, రానా…ఇద్దరం సినిమాను అమితంగా ప్రేమిస్తాం. అదే మా ప్రపంచం. అందుకే ఈ కథలో నటించడంతో పాటు నిర్మాణంలో కూడా భాగమయ్యాం. 1950కాలంలో వాడిన సినిమా తాలూకు కొన్ని అరుదైన పరికరాలను ఈ సినిమాలో చూపించాం. పాతాళభైరవికి ఉపయోగించిన కెమెరాను చూపించాం. కాలాన్ని రీక్రియేట్ చేసే ఇలాంటి సినిమాలు అరుదుగా వస్తుంటాయి’ అన్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nikeelu Gunda | సూపర్ ఏఐ అకాడమీ ఫౌండర్ నికీలు గుండాకు ప్రతిష్ఠాత్మక పురస్కారం
100 Feets Master Plan Road | మేం కష్టపడి కట్టుకున్న స్కూల్ పోతుంది.. 100 అడుగుల మాస్టర్ ప్లాన్ రోడ్డు రీఅలైన్మెంట్పై బాధిత మహిళ
NBK 112 | మ్యూజిక్ డైరెక్టర్‌పై క్లారిటీ.. అనిరుధ్, జీవీ ప్రకాష్‌లకు నో ఛాన్స్, బాలయ్య సినిమా అప్డేట్ ఇదే!
TN CM Vijay | జైలు నుంచి ఖైదీల పరారీ ఘటన.. తమిళనాడు సీఎం విజయ్ కీలక ఆదేశాలు..!
AP News | ఏపీలో దారుణం.. తరగతి గదిలో విద్యార్థినిపై ఎలక్ట్రిక్ రంపంతో నిందితుడి దాడి.. పరిస్థితి విషమం
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

