గుర్తు పట్టకుండా మారిపోయిన జబర్ధస్త్ కమెడీయన్

జబర్దస్త్ చూస్తున్న ప్రేక్షకులకు జీవన్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. కామన్ కమెడియన్ గా వచ్చి టీమ్ లీడర్ స్థాయికి ఎదిగాడు. అందరితో ఎరుపు అనిపించుకుంటూ అదిరిపోయే నవ్వులు పూయిస్తుంటాడు జీవన్. అలాంటి కమెడియన్ ఇప్పుడు ఇలా అయిపోయాడు. ఈయన్ని చూడగానే అంతా ఒక్కసారిగా షాక్ అవుతున్నారు. ఒకప్పుడు బొద్దుగా ఉన్న జీవన్.. ఇప్పుడు పీలగా మారిపోయాడు. పూర్తిగా బరువు తగ్గిపోయి.. మొహంలో కనీసం కళ కూడా లేకుండా మారిపోయాడు. అసలేమైంది.. జీవన్ ఎందుకు ఇలా అయిపోయాడు అంటూ జబర్దస్త్ కొత్త ప్రోమో విడుదలైన తర్వాత ఆడియన్స్ ఆరా తీస్తున్నారు. కేవలం కామెడీ మాత్రమే కాకుండా పాటలు పాడటం.. డప్పు కొట్టడం అద్భుతంగా చేస్తుంటాడు ఈయన.
ఈయనకు జిగేల్ జీవన్ అనే పేరు కూడా ఉంది. కొన్ని వారాలుగా అక్కడ కనిపించడం లేదు జీవన్. ఈయన్ని తీసేసారేమో అనుకున్నారు కానీ అనారోగ్యం కారణంగా జబర్దస్త్ షో కు దూరంగా ఉన్నాడు జీవన్. అనారోగ్యం అంటే చిన్నదేం కాదు.. దాదాపు చావు అంచుల వరకు వెళ్లొచ్చాడు ఈయన. ఇంకా చెప్పాలంటే చనిపోతాడని డాక్టర్లు కూడా కన్ఫర్మ్ చేసారు. ఆశలు వదిలేసుకోవాలంటూ తేల్చేసారు. అలాంటి సమయంలో కుటుంబం అంతా రోడ్డున పడుతుందేమో అని ఎమోషనల్ అయిపోయాడు జీవన్. కానీ ఆ సమయంలో జబర్దస్త్ టీమ్ అంతా ఒక్కటైంది. జీవన్ కోసం వాళ్లు తోచిన సాయం చేసారు. ఆర్థికంగానే కాకుండా మనో ధైర్యం కూడా ఇచ్చి బతికించారు.
ఇదంతా జబర్దస్త్ స్టేజీపై చెప్తూ కన్నీటి పర్యంతం అయ్యాడు జీవన్. వాళ్లు లేకపోతే నేను ఈ రోజు బతికుండేవాడిని కాదంటూ ఏడ్చేసాడు. ఈ రోజు తాను బతికి ఉన్నానంటే కారణం జబర్దస్త్ టీమ్ లీడర్స్ అంటూ ఎమోషనల్ అయిపోయాడు జీవన్. అందరికీ చేతులెత్తి దండం పెట్టాడు ఈ కమెడియన్. ఒకసారి కాదు రెండుసార్లు ఈయనకు అనారోగ్య సమస్యలు వచ్చాయి. రెండో సారి చాలా సీరియస్ అయింది. అందుకే జబర్దస్త్ కు దూరంగా ఉన్నాడు. అప్పట్లో పంచ్ ప్రసాద్ కూడా ఇలాగే అనారోగ్యం పాలయ్యాడు. అప్పుడు కూడా జబర్దస్త్ కుటుంబం అండగా నిలబడింది. ఇప్పుడు జీవన్ విషయంలోనూ ఇదే చేసి రియల్ హీరోస్ అనిపించుకున్నారు జబర్దస్త్ కమెడియన్స్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- jabardasth
- jeevan
RELATED ARTICLES
తాజా వార్తలు
Crude Oil Price | ఐదు నెలల గరిష్ఠానికి ముడిచమురు ధరలు.. కారణాలివే..!
Daaku Maharaj | ‘డాకు మహారాజ్’ ఓఎస్టీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎట్టకేలకు అభిమానుల చిరకాల కోరిక తీరనుందా?
IndiGo flight | ప్రయాణికుడికి అస్వస్థత.. ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్..!
Tiger Shroff | టైగర్ ష్రాఫ్పై దాడిచేస్తే విదేశాల్లో ఉద్యోగం, భారీగా డబ్బు.. దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి..!
Kim Jong Un | కిమ్ చనిపోలేదు.. బతికే ఉన్నారు.. మరణవార్తల ప్రచారం వేళ కొత్త ఫొటోలు విడుదల చేసిన ఉత్తర కొరియా
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

