Keerthy Suresh | ఆ మిస్టరీ పర్సనెవరో నాకే తెలియదు?
‘నా కూతురు పెళ్లి చేయాల్సింది నేను. నన్ను చేయనివ్వండి. మీకెందుకు తొందర?’ అంటూ అసహనం వ్యక్తం చేశారు సురేశ్ కుమార్. ఇంతకి ఈ సురేశ్‌కుమార్ ఎవరనుకుంటున్నారా? మన మహానటి కీర్తి సురేశ్ నాన్నగారు.
‘నా కూతురు పెళ్లి చేయాల్సింది నేను. నన్ను చేయనివ్వండి. మీకెందుకు తొందర?’ అంటూ అసహనం వ్యక్తం చేశారు సురేశ్ కుమార్. ఇంతకి ఈ సురేశ్‌కుమార్ ఎవరనుకుంటున్నారా? మన మహానటి కీర్తి సురేశ్ నాన్నగారు. కొన్ని రోజులుగా కీర్తి సురేశ్ పెళ్లిపై సోషల్ మీడియాలో రూమర్లు చక్కర్లుకొడుతున్నాయి. సంగీత దర్శకుడు అనిరుధ్, కీర్తి ప్రేమలో ఉన్నారని, త్వరలో పెళ్లిపీటలు ఎక్కనున్నారని ఈ రూమర్ల సారాంశం. దక్షిణాదిలోనే అనుకుంటే.. ఈ వార్త బాలీవుడ్ మీడియాలో కూడా బలంగా వినపడుతున్నది. దీంతో సురేశ్ కుమార్ అసహనం వ్యక్తం చేశారు.
‘అసలు ఈ వార్తల్లో నిజంలేదు. ఎవరో పనిగట్టుకొని పుకార్లు సృష్టిస్తున్నారు. ఇంతకుముందు కూడా ఇలాంటి వార్తలు కొన్ని వచ్చాయి. మేం పట్టించుకోలేదు. రానురాను మరీ ఎక్కువ చేస్తున్నారు’ అంటూ మండిపడ్డారు సురేశ్ కుమార్. ఈ విషయంపై కీర్తి సురేశ్ మాట్లాడుతూ ‘అనిరుధ్ నాకు మంచి స్నేహితుడు. ఇంచుమించూ మాది ఒకే ఏజ్. అందుకే క్లోజ్‌గా ఉంటాం. దానికే ప్రేమంటే ఎలా? నా జీవితంలోకి అడుగుపెట్టే ఆ మిస్టరీ పర్సన్ ఎవరో నాకే తెలీదు. తెలిస్తే తప్పకుండా చెబుతాను’ అన్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

