Jason Sanjay | తమిళ సినీ రంగంలోనూ, రాజకీయ వాతావరణంలోనూ ప్రస్తుతం సీఎం విజయ్ కుటుంబానికి సంబంధించిన ఏ చిన్న వార్త అయినా క్షణాల్లో వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. తాజాగా విజయ్ తనయుడు జేసన్ సంజయ్ తన మొట్టమొదటి దర్శకత్వ ప్రాజెక్ట్ అయిన ‘సిగ్మా’ (Sigma) చిత్ర ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా సేలంలో జరిగిన ఓ భారీ ఈవెంట్లో పాల్గొన్నారు. అయితే ఈ వేడుకలో సినిమా విశేషాల కంటే అభిమానులు చేసిన హడావుడి, జేసన్ సంజయ్ చూపించిన సంయమనం అందరి దృష్టిని ఆకర్షించాయి.
సేలంలో జరిగిన ఈ వేడుకకు భారీగా తరలివచ్చిన విజయ్ అభిమానులు ఒక్కసారిగా ‘టీవీకే.. టీవీకే’ (TVK) అంటూ నినాదాలతో సభా ప్రాంగణాన్ని హోరెత్తించారు. తన తండ్రి విజయ్ స్థాపించిన రాజకీయ పార్టీ పేరుతో అభిమానులు జోరుగా కేకలు వేస్తుండగా, వేదికపై ఉన్న జేసన్ సంజయ్ ఏమాత్రం తికమక పడకుండా ఎంతో ప్రశాంతంగా, చిరునవ్వుతో స్పందించారు. అభిమానులను చూస్తూ థంబ్స్ అప్ చూపించి అభివాదం చేయడంతో అక్కడి వాతావరణం మరింత ఉత్సాహంగా మారింది.
ఈ సందర్భంగా తన తొలి చిత్రం ‘సిగ్మా’ గురించి జాసన్ సంజయ్ ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ప్రతి ఒక్కరి జీవితంలో ఎదురయ్యే ఊహించని కష్టాలు, సవాళ్లు, వాటిని ఎదుర్కొంటూ సాగే ఓ సామాన్యుడి అద్భుతమైన ప్రయాణమే ఈ చిత్ర కథాంశం అని ఆయన తెలిపారు. ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ భారీ బడ్జెట్తో తెరకెక్కిస్తున్న ఈ సినిమా అక్టోబర్ 02న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
CROWD: TVK…TVK….
Sanjay-Thumb Up😁👍🏻#Sigma #Jasonsanjay pic.twitter.com/hjUNOxgbDx
— Surya_Surya (@VSuryadhanush) September 8, 2026