అందుకే మౌనంగా ఉన్నా!
తెలుగులో జాన్వీ కపూర్ చేసిన దేవర, పెద్ది సినిమాలు వాణిజ్యపరంగా ఎలాగున్నా.. పాత్రల పరంగా మాత్రంఆమెకు చేదు అనుభవాలనే మిగిల్చాయి.
తెలుగులో జాన్వీ కపూర్ చేసిన దేవర, పెద్ది సినిమాలు వాణిజ్యపరంగా ఎలాగున్నా.. పాత్రల పరంగా మాత్రంఆమెకు చేదు అనుభవాలనే మిగిల్చాయి. ఆ పాత్రల విషయంలో విమర్శలను కూడా ఆమె ఎదుర్కోవలసివచ్చింది. అయితే.. ఇన్నాళ్లూ వాటిపై స్పందించని జాన్వీ.. తొలిసారి ‘కాఫీ విత్ కరణ్ 9’ టాక్‌షోలో వాటిగురించి మాట్లాడింది. ‘ముందుగానే నటీనటులకు స్క్రిప్ట్ అందించడం, కెమెరా యాంగిల్స్ వివరాలనుస్పష్టంగా పేర్కొనడం దక్షిణాది సినిమాల్లో జరగదు.
నాకున్న సినీ నేపథ్యాన్ని ఉపయోగించుకొని అప్పుడే కాస్త గట్టిగా అభిప్రాయాలను వెల్లడించాల్సింది. కానీ నేను అలా చేయలేదు. కాబట్టి, ఇందులో నా తప్పు కూడా ఉంది. ఆ సినిమాల కోసం చాలామంది కష్టపడ్డారు. పొరపాట్లు ఏమైనా జరిగితే దానిలో నా బాధ్యత కూడా ఉంటుంది కదా. అందుకే మౌనంగా ఉన్నాను. షూటింగ్ టైమ్‌లో దర్శకుడు చెప్పినట్టు చేయాలనే వృత్తిపరమైన ఒత్తిడి కూడా ఉంటుంది. ఏదేమైనా.. వాటి వల్ల ఎదురైన బాధనూ, భారాన్ని ఎప్పటికీ మోస్తూనే ఉంటాను. ఇకపై ఈ విషయం గురించిఎక్కడా ప్రస్తావించాలనుకోవడం లేదు’ అంటూ జాన్వీ స్పష్టం చేసింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?

