తమిళనాడు సీఎం, అగ్ర కథానాయకుడు దళపతి విజయ్ అభిమానుల సుదీర్ఘ నిరీక్షణకు తెరపడింది. సెన్సార్ చిక్కుల్లో పడి విడుదల విషయంలో వరుస వాయిదాలు ఎదుర్కొన్న ‘జన నాయగన్’ సినిమా విడుదల తేదీ ఖరారైంది. ఈ నెల 23న భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ సందర్భంగా బుధవారం కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు.
ఇందులో దళపతి విజయ్ పోలీస్ గెటప్‌లో ైస్టెలిష్ అండ్ పవర్ఫుల్ లుక్‌లో కనిపిస్తున్నారు. రాజకీయరంగ ప్రవేశం సమయంలోనే ‘జన నాయగన్’ తన చివరి చిత్రమని ప్రకటించారు హీరో విజయ్. ఇక తన జీవితాన్ని ప్రజాసేవకే అంకితం చేస్తారని తెలిపారు.
ఈ నేపథ్యంలో ఈ సినిమా కోసం అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. విజయ్ ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత విడుదలవుతున్న చిత్రమిదే కావడంతో సామాన్య ప్రజానీకంలో కూడా ఈ సినిమాపై ఆసక్తి నెలకొంది. హెచ్.వినోద్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని కేవీఎన్ ప్రొడక్షన్స్ సంస్థ నిర్మించింది.