Jacqueline : మరోసారి విచారణకు జాక్వెలిన్.. 200 కోట్ల రూపాయలు స్కామ్ చేసిందా?

బాలీవుడ్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండేజ్ చుట్టూ ఉచ్చు బిగిస్తుంది. ఆమెను మనీ లాండరింగ్ దోపిడీ కేసులో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మరోసారి విచారణకు పిలిచింది. సెప్టెంబర్ 25న శనివారం నాడు ఫైనాన్షియల్ ప్రోబ్ ఏజెన్సీ ఢిల్లీ యూనిట్ ముందు హాజరు కావాలని అధికారులు నటిని కోరారు. అందుకు జాక్వెలిన్ కూడా ఒప్పుకున్నట్టు సమాచారం. ఆమె తనపై వస్తున్న ఆరోపణలు అబద్దమని నిరూపించేందుకు ప్రయత్నం చేస్తోంది.
200 కోట్ల రూపాయల మనీలాండరింగ్ కు సంబంధించిన విచారణకు జాక్వెలిన్ ను అధికారులు పిలిచారని వార్తలు వస్తున్నాయి. అయితే ఆమె సూత్రధారిగా కాకుండా బాధితురాలిగా ఈడీ ముందు హాజరు అవుతుందని కొందరు చెబుతున్నారు. రూ. 200 కోట్ల స్కాంలో చంద్రశేఖర్ అనే వ్యక్తి సూత్రధారి అని తేలింది. జాక్వెలిన్ తో అతడి గర్ల్ ఫ్రెండ్ పరిచయాన్ని పెంచుకొని ఈమెను స్కాంలోకి లాగారని తెలుస్తోంది. వారి మాయలో పడి జాక్వెలిన్ మోసపోయారని తెలిసింది.
2017ఎలక్షన్ కమిషన్ కు ఇచ్చిన లంచం కేసులో అరెస్ట్ అయిన చంద్రశేఖర్‌ని విచారించగా చాలా మంది పేర్లు బయటకు వచ్చాయి. అందులో జాక్వెలిన్ పేరు కూడా ఉంది. తీహార్ జైలు లోపల నుంచే దాదాపు 200 కోట్ల విలువైన దోపిడీ రాకెట్ నడుపుతున్నట్టు సదురు వ్యక్తిపై ఆరోపణలున్నాయి. అయితే నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ను ఈడీ అధికారులు ఇదివరకే ప్రశ్నించగా.. మరోసారి విచారణకు హాజరు కావాలంటూ సమన్లు జారీ చేయడం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Woman Delivers Baby On Bus | బస్సులో ప్రయాణించిన గర్భిణీకి ప్రసవ వేదన.. ఆడ బిడ్డకు జన్మ
Polio Drops | పోలియో గురించి తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు ఇవే..
Oh Na Siddayya | శంషాబాద్‌లో ఘనంగా ‘ఓ నా సిద్ధయ్య’ పాట విడుదల.. హాజరైన సోనూసూద్!
AP Elections | ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి : ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా
ముగిసిన సింగరేణి కంపెనీ స్థాయి చెస్, క్యారమ్స్ పోటీలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

