వినోదంతో పాటు సందేశం
‘స్లమ్ డాగ్ హజ్బెండ్' పూర్తి వినోదాత్మక చిత్రం. సినిమా ఆద్యంతం నవ్వుకునేలా వుంటుంది. అంతర్లీనంగా ఓ సందేశం కూడా వుంటుంది’ అన్నారు నిర్మాతలు అప్పిరెడ్డి, వెంకట్ అన్నపరెడ్డి. ఈ నిర్మాత ద్వయం నిర్మించిన చిత్రం ‘స్లమ్ డాగ్ హజ్బెండ్'. ఏఆర్ శ్రీధర్ దర్శకుడు.
‘స్లమ్ డాగ్ హజ్బెండ్’ పూర్తి వినోదాత్మక చిత్రం. సినిమా ఆద్యంతం నవ్వుకునేలా వుంటుంది. అంతర్లీనంగా ఓ సందేశం కూడా వుంటుంది’ అన్నారు నిర్మాతలు అప్పిరెడ్డి, వెంకట్ అన్నపరెడ్డి. ఈ నిర్మాత ద్వయం నిర్మించిన చిత్రం ‘స్లమ్ డాగ్ హజ్బెండ్’. ఏఆర్ శ్రీధర్ దర్శకుడు. సంజయ్రావు, ప్రణవి మానుకొండ జంటగా నటించిన ఈ చిత్రం ఈ నెల 29న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో నిర్మాతలు మీడియాతో ముచ్చటించారు.
ఈ సందర్భంగా అప్పిరెడ్డి, వెంకట్లు మాట్లాడుతూ ‘మాది సూర్యాపేట జిల్లా. మాకు ఊర్లో థియేటర్ కూడా వుండేది. అందుకే సినిమాల మీద ఆసక్తి వుంది. వ్యాపారరీత్యా విదేశాలకు వెళ్లాం. అక్కడ ఓ హాలీవుడ్ సినిమాను కూడా నిర్మించాం. తెలుగులో ‘జార్జిరెడ్డి’ చిత్రంతో నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టాం. ‘స్లమ్ డాగ్ హజ్బెండ్’ను మూఢ నమ్మకాల మీద సెటైర్లా వుండే పూర్తి కామెడీ కథతో నిర్మించాం. తప్పకుండా ఈ చిత్రం అందరికి కొత్తగా వుండటంతో పాటు వినోదాన్ని పంచుతుంది. మా సంస్థలో విభిన్న చిత్రాలు నిర్మించాలనేది మా లక్ష్యం.ఆ దిశగానే అడుగులు వేస్తున్నాం. మేము నిర్మించిన ‘మిస్టర్ ప్రెగ్నెంట్’ చిత్రం విడుదలకు సిద్ధంగా వుంది. మరో ఆరు ప్రాజెక్ట్లు కూడా చర్చల దశలో వున్నాయి. వీటి ద్వారా కూడా న్యూటాలెంట్ను పరిచయం చేస్తున్నాం. వాటి వివరాలు కూడా త్వరలో వెల్లడిస్తాం’ అన్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Crime News | తల్లిని కత్తితో పొడిచి, భవనంపై నుంచి దూకి.. తొమ్మిదో తరగతి బాలుడి ఆత్మహత్య..!
Tirumala News | శ్రీవారి భక్తులకు గుడ్న్యూస్.. ఫిబ్రవరి నెల కోటా విడుదల
Bodies of SPOs | దారుణం.. శవపేటికలు లేకుండా డంపర్లో పోలీసుల మృతదేహాలు తరలింపు..!
buses carrying pilgrims collide | యాత్రికులతో వెళ్తున్న రెండు బస్సులు ఢీ.. నలుగురు మృతి, 30 మందికి గాయాలు
Kondagattu | కొండగట్టులో ఆర్జిత సేవలు , వీఐపీ దర్శనాలు తాత్కాలికంగా నిలిపివేత
ట్రెండింగ్ వార్తలు
Newborn dies due to DJ Sound | డీజే శబ్దానికి గుండె ఆగి.. నవజాత శిశువు మృతి
Watch: ప్రెస్మీట్లో ఒక వ్యక్తిని ముద్దుపెట్టుకున్న బీజేపీ ఎమ్మెల్యే.. ఏఐ వీడియో అని ఆయన భార్య ఆరోపణ
Hindu names on Muslim wedding cards | ముస్లింల వెడ్డింగ్ కార్డులపై హిందూ పేర్లు.. నిఖా రద్దు చేయాలని బెదిరింపులు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్

