Kamal Haasan | ప్రభాస్ ‘ప్రాజెక్ట్-కె’లో కమల్‌హాసన్ ఎందుకు నటిస్తున్నారో తెలుసా?
ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం ‘కల్కి 2898 ఏడీ’ ఫస్ట్ గ్లింప్స్‌కు దేశవ్యాప్తంగా అద్భుతమైన స్పందన లభించింది. నాగ్అశ్విన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సూపర్‌హీరో కథాంశంతో తెరకెక్కిస్తున్నారు.
Kamal Haasan | ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం ‘కల్కి 2898 ఏడీ’ ఫస్ట్ గ్లింప్స్‌కు దేశవ్యాప్తంగా అద్భుతమైన స్పందన లభించింది. నాగ్అశ్విన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సూపర్‌హీరో కథాంశంతో తెరకెక్కిస్తున్నారు. ఇటీవల అమెరికా శాండియాగో కామిక్ కాన్ ఈవెంట్లో టైటిల్, ఫస్ట్‌గ్లింప్స్‌ను ఆవిష్కరించిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో అగ్ర నటుడు కమల్‌హాసన్ ప్రతినాయకుడి పాత్రలో కనిపించబోతున్నారు. అమెరికాలో ఓ హాలీవుడ్ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ‘ప్రాజెక్ట్-కె’ చిత్రంలో తాను నటించడానికి గల కారణాలను వివరించారు కమల్‌హాసన్. ఆయన మాట్లాడుతూ ‘ఈ సినిమాలో నేను నటిస్తానని ఎవరూ ఊహించలేదు.
శాండియాగో ఈవెంట్లో ప్రభాస్ ఇదే విషయాన్ని నాతో అన్నారు. ‘ఈ సినిమాలో భాగమైనందుకు థాంక్యూ సర్. ఈ సినిమా కోసం మిమ్మల్ని ఎలా ఒప్పించారనే విషయం ఇప్పటికీ నాకు ఆశ్చర్యంగానే ఉంది’ అని ప్రభాస్ చెప్పారు. పురాణాలను, భవిష్యత్తును కలబోసి నాగ్అశ్విన్ గొప్ప కథను తయారు చేశాడు. మనందరం వేల సంవత్సరాలుగా పురాణాలను అనుసరిస్తున్నాం. వాటి గొప్పతనాన్ని ఈ సినిమాలో చూపించబోతున్నారు. అందుకే ప్రతినాయకుడి పాత్రలో నటించడానికి అంగీకరించా’ అని కమల్‌హాసన్ పేర్కొన్నారు. వైజయంతీ మూవీస్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకురానుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Allari Subhashini | “సుమ నా ప్రాణదాత.. మళ్లీ జన్మంటూ ఉంటే ఆమెలాంటి బిడ్డ కావాలి”.. కన్నీళ్లు పెట్టుకున్న అల్లరి సుభాషిణి!
Masooda | ఏ హర్రర్ సినిమా వచ్చినా ‘మసూద’తోనే పోలిక.. తిరువీర్ బ్లాక్‌బస్టర్ మూవీ మరోసారి ట్రెండింగ్‌లో!
Mulugu | ములుగు రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు అరెస్ట్!
Fake Police | పోలీసు అధికారిగా నటిస్తూ కిడ్నాప్‌లు, దోపిడీలు.. రెండు సార్లు జైలుకు వెళ్లినా మారని తీరు
Rajeev Kanakala | భార్య సుమ గురించి చెబుతూ కన్నీళ్లు పెట్టుకున్న రాజీవ్ కనకాల.. వీడియో వైరల్
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

