OTT | ఆల్ ఇన్ వన్ ఓటీటీ కావాలి!
స్మార్ట్ ప్రపంచంలో వినియోగదారుడికి వినోదం మరింత దగ్గరైంది. ఓటీటీ యుగంలో ప్రేక్షకుడికి కావాల్సినంత ఎంటర్టైన్మెంట్ అందుబాటులోకి వచ్చింది.
OTT : స్మార్ట్ ప్రపంచంలో వినియోగదారుడికి వినోదం మరింత దగ్గరైంది. ఓటీటీ యుగంలో ప్రేక్షకుడికి కావాల్సినంత ఎంటర్టైన్మెంట్ అందుబాటులోకి వచ్చింది. డిమాండ్‌కు మించి సరుకు అందబాటులో ఉన్నప్పుడు కామన్‌మ్యాన్‌కు కన్ఫ్యూజన్ తప్పదు. ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకుడు కూడా ఇదే ఫీలవుతున్నాడు. ఫోన్లో లెక్కకు మించి ఇన్స్టాల్ చేసుకున్న ఓటీటీ యాప్‌లలో దేనికి ఓటు వేయాలో తెలియక తికమకపడుతున్నాడు. ప్రతి 100లో 95 మంది అన్ని ఓటీటీలూ కలిపి ఒకే వేదికపై ఉండాలని కోరుతున్నారు. ఇటీవల ఒక సంస్థ నిర్వహించిన సర్వేలో మరిన్ని ఆసక్తిక విషయాలు వెల్లడయ్యాయి..
ఓటీటీ ప్రేక్షకుల్లో 72 శాతం మంది ప్రతిరోజూ ఓ వింత సమస్యను ఎదుర్కొంటున్నారు! ముందురోజు సినిమా ఏ యాప్‌లో చూసింది మర్చిపోయి.. వెతుకులాటలోనే పుణ్యకాలం కాస్తా గడిపేస్తున్నారట. దాదాపు 10 నిమిషాలు వెతికితే తప్ప.. ఏ యాప్‌లో చూశారో గుర్తించలేకపోతున్నారట.
ఆరంభ శూరత్వంతో అందుబాటులో ఉన్న అన్ని ఓటీటీ యాప్స్‌ను ఇన్స్టాల్ చేసుకున్న ప్రేక్షకులు.. ఏడాది సబ్స్క్రిప్షన్ తర్వాత వాటిని కొనసాగించడానికి ఆసక్తి చూపించడం లేదు. 26 శాతం మంది ప్రధాన ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ మినహా మిగతా వాటిని వదిలించుకుంటున్నారట. భారత్ వరకే చూసుకుంటే దాదాపు 41 శాతం మంది ఏడాది సబ్స్క్రిప్షన్ తర్వాత ఐదు ప్రధాన స్ట్రీమింగ్ ఆన్ డిమాండ్ యాప్‌లలో ఒకదానికి పూర్తిగా వీడ్కోలు పలుకుతున్నారని సర్వే సారాంశం.
62 శాతం మంది వివిధ స్ట్రీమింగ్ యాప్‌లలో వాళ్లు చూడాలనుకునే కంటెంట్ దొరక్క ఫ్రస్ట్రేషన్‌కు గురవుతున్నారట. 77 శాతం మంది ఉన్న యాప్స్‌లో వాళ్లు అనుకున్న సమయానికి ఏది ఎంచుకోవాలో నిర్ణయించుకోలేక పోతున్నారని సర్వేలో వెల్లడైంది.
అనుకున్న యాప్‌లో కోరుకున్న సినిమా గానీ, వెబ్‌సిరీస్ గానీ దొరికినా.. పది నిమిషాలు స్ట్రీమింగ్ తర్వాత గానీ దానిని కొనసాగించలేకపోతున్న వారు 30 శాతం మంది వరకు ఉన్నారు. 2021లో ఇది 17 శాతంగా ఉంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Watch: కర్వా చౌత్ రోజున ప్రియుడిని కలిసిన భార్య.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న భర్త
Congress Party | కాంగ్రెస్ పార్టీలో గ్రూప్ రాజకీయాలతో సతమతమయ్యాం..కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లోకి : ఐనేని దీపక్ రావు
New Plant | అరుణాచల్‌లో రెండు కొత్త మొక్కల గుర్తింపు
విద్యుత్ షాక్‌తో పాడి బర్రె మృతి
కంపెనీ స్థాయి చెస్, క్యారమ్స్ పోటీలు ప్రారంభం
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

