వన్‌సైడ్ లవ్‌లో ఉన్నా!
‘ప్రేమమ్' చిత్రంతో సినీరంగంలోకి అరంగేట్రం చేసిన మలయాళీ సోయగం అనుపమ పరమేశ్వరన్ తొలిచిత్రంతోనే దక్షిణాది యువత హృదయాల్ని కొల్లగొట్టింది. చూడముచ్చటైన రూపం, చక్కటి అభినయంతో అనతికాలంలోనే అగ్ర కథానాయికగా ఎదిగింది. ప్రస్తుతం ఈ భామ తెలుగులో ‘18పేజీస్' ‘కార్తికేయ-2’ ‘బటర్ ఫ్లై’ చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది
‘ప్రేమమ్’ చిత్రంతో సినీరంగంలోకి అరంగేట్రం చేసిన మలయాళీ సోయగం అనుపమ పరమేశ్వరన్ తొలిచిత్రంతోనే దక్షిణాది యువత హృదయాల్ని కొల్లగొట్టింది. చూడముచ్చటైన రూపం, చక్కటి అభినయంతో అనతికాలంలోనే అగ్ర కథానాయికగా ఎదిగింది. ప్రస్తుతం ఈ భామ తెలుగులో ‘18పేజీస్’ ‘కార్తికేయ-2’ ‘బటర్ ఫ్లై’ చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది. ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ప్రేమ, పెళ్లి గురించి తన అభిప్రాయాల్ని వ్యక్తం చేసిందీ అమ్మడు.
తాను వన్‌సైడ్ లవ్‌లో ఉన్నానని, అవతలి వారి ప్రతిస్పందన ఏమిటో తెలియదని చెప్పింది. ‘ప్రస్తుతం నా రిలేషన్షిప్ స్టేటస్ ఏమిటో నాకే అర్థం కావడం లేదు. అంతా అయోమయంగా ఉంది. ఓ రకంగా నాది వన్‌సైడ్ లవ్ అనుకోవచ్చు’ అంటూ చెప్పుకొచ్చింది. తనకు ప్రేమ వివాహంపై మంచి అభిప్రాయం ఉందని, ప్రేమించి పెళ్లిచేసుకున్న జంటల్ని చూసి హ్యాపీగా ఫీలవుతానని అనుపమ పరమేశ్వరన్ పేర్కొంది. తాను కూడా భవిష్యత్తులో తప్పకుండా ప్రేమ వివాహాన్నే చేసుకుంటానని, ఈ విషయాన్ని తన పేరెంట్స్‌కు కూడా చెప్పానని తెలిపింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కొత్తగూడెం ఏరియాలో అథ్లెటిక్స్ పోటీలు ప్రారంభం
‘కరకట్ట నిర్మాణం వల్ల బూర్గంపాడుకు అపార నష్టం’
‘ఓటరు నమోదులో వేగం పెంచాలి… రేవంత్ రెడ్డిని గద్దె దించాలి’
‘పిల్లలపై లైంగిక నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి’
Harish Rao | చంద్రబాబు నాయుడు ఏపీకి కరువు లేకుండా చేశారు.. తెలంగాణకు కరువు తెచ్చిందే కాంగ్రెస్ : హరీశ్ రావు
ట్రెండింగ్ వార్తలు
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?

