Spirit Of Fighter | బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ (Hrithik Roshan) కాంపౌండ్ నుంచి వస్తున్న ప్రాజెక్ట్ స్పిరిట్ ఆఫ్ ఫైటర్ (Spirit Of Fighter). సిద్దార్థ్ ఆనంద్ డైరెక్ట్ చేస్తున్నాడు. ఇండియా మొట్టమొదటి ఏరియల్ డ్రామా నేపథ్యంలో వస్తోన్న ఈ మూవీలో అనిల్ కపూర్, దీపికా పదుకొనే (Deepika Padukone) ఇతర కీ రోల్స్ పోషిస్తున్నారు. ఈ చిత్రం నుంచి ఇప్పటికే విడుదల చేసిన హృతిక్ రోషన్ , దీపికాపదుకొనే రోల్స్ లుక్స్ నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి.
ఫైటర్ 2024 జనవరి 25న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో ఏదో ఒక ప్రమోషనల్ అప్డేట్ అందిస్తున్నారు. తాజాగా ట్రైలర్ ఎప్పుడనేది క్లారిటీ ఇచ్చారు. ఫైటర్ ట్రైలర్‌ను రేపు మధ్యాహ్నం 12 గంటలకు ఆన్లైన్లో లాంఛ్ చేయనున్నట్టు ప్రకటించారు. ఈ చిత్రంలో కరణ్ సింగ్ గ్రోవర్, అక్షయ్ ఒబెరాయ్, సంజీదా షేఖ్, తలత్ అజిజ్ ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.
ఈ చిత్రంలో హృతిక్ రోషన్ ఎయిర్ డ్రాగన్స్ విభాగంలో స్క్వాడ్రన్ పైలట్ గా పనిచేసే స్క్వాడ్రన్ లీడర్ షంషేర్ పఠానియా (పాటీ)గా కనిపించబోతున్నాడు. మరోవైపు దీపికాపదుకొనే ఎయిర్ డ్రాగన్ యూనిట్లో పనిచేసే స్క్వాడ్రన్ లీడర్ మిన్నిగా కనిపించనుండగా.. ఈ ఇద్దరి లుక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ మూవీని వయాకామ్ 18 స్టూడియోస్-మార్ఫ్లిక్స్ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
వినీలాకాశంలో ఫైటర్ జెట్స్ ఎగురుతూ.. దేశభక్తి ఉప్పొంగిపోయేలా కనిపిస్తున్న ఫైటర్ లుక్ ఇప్పటికే నెట్టింట చక్కర్లు కొడుతూ.. సినిమాపై అంచనాలు పెంచేస్తుంది. సిల్వర్ స్క్రీన్‌పై హృతిక్ రోషన్, దీపికా పదుకొనే క్రేజీ కాంబోలో వస్తున్న తొలి సినిమా ఇది. ఈ నేపథ్యంలో సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. మరోవైపు పఠాన్ తర్వాత సిద్దార్థ్ ఆనంద్ కాంపౌండ్ నుంచి వస్తున్న కావడంతో ఫైటర్‌పై సూపర్ బజ్ క్రియేట్ అవుతోంది.
ట్రైలర్ లాంఛ్ టైం ఫిక్స్..
The Air Dragons are geared up to soar, fight and protect 🇮🇳 #FighterTrailer TOMORROW at 12:00 PM IST. #Fighter Forever#FighterOn25thJan releasing worldwide. Experience on the big screen in IMAX 3D. pic.twitter.com/mjNxvmof8M
— Viacom18 Studios (@Viacom18Studios) January 14, 2024
ఫైటర్ స్పెషల్ వీడియో..
#FIGHTER MONTH BEGINS. Releasing on 25th January. Experience on the BIG screen in IMAX 3D. See you in theatres on the eve of India’s 75th Republic Day 🇮🇳#FighterMovie #FighterOn25thJan pic.twitter.com/9EcGl6kewq
— MARFLIX PICTURES (@MarflixP) January 1, 2024
మిన్ని ఫస్ట్ లుక్..
Here is #DeepikaPadukone in a groundbreaking portrayal as Squadron Leader Minal Rathore in #Fighter, known by her call sign ‘Minni’. 🌟
Her role as a Squadron Pilot in the Air Dragons unit showcases resilience and valor.
This marks her first ‘mission’ as a helicopter pilot as… pic.twitter.com/26nseSSCXB
— Ashwani kumar (@BorntobeAshwani) December 5, 2023
Squadron Leader Shamsher Pathania
Call Sign: Patty
Designation: Squadron Pilot
Unit: Air DragonsFighter Forever 🇮🇳#Fighter #FighterOn25thJan #FighterMovie pic.twitter.com/os5XkTD3hS
— Hrithik Roshan (@iHrithik) December 4, 2023
Want this craze again🔥 #Fighter pic.twitter.com/81o67xWq9C
— Ansh (@ansh_0123) November 27, 2023
Bas kuch pal intejar h,uske baad gadar hoga 🔥🔥🔥#Fighter #HrithikRoshanpic.twitter.com/nSEu29aPDz
— ᴿᴬᴹᴮᴼ 🅵🅸🅶🅷🆃🅴🆁 (@rambo_SATYA_) December 3, 2023
#Fighter#ElectionResults
Lets go #Dunki #srk #jawan #Prabhas 📷 📷 #PrashanthNeel #Tiger3 #skf #SalmanKhan #KatrinaKaif #AnimalMovie #ANIMAL #Salaar 📷 📷 #SalaarCeaseFire 📷 #snow #U17WC #AnimalTheMovie #MelodySalaar $portal @Portalcoin pic.twitter.com/IoNRWsQBMT— shiv |✨OVERWORLD (@Shivkum61957461) December 3, 2023
Spirit Of Fighter అప్డేట్..