Spirit Of Fighter | హృతిక్ రోషన్, దీపికా పదుకొనే క్రేజీ కాంబో.. Spirit Of Fighter బిగ్ అప్డేట్
Spirit Of Fighter | గతేడాది విక్రమ్ వేధ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు హృతిక్ రోషన్ (Hrithik Roshan). చాలా కాలంగా సరైన బ్రేక్ కోసం ఎదురుచూస్తున్న హృతిక్ రోషన్ తాజాగా స్పిరిట్ ఆఫ్ ఫైటర్ (Spirit Of Fighter) మూవీలో నటిస్తున్నాడు.
Spirit Of Fighter | బాలీవుడ్ హ్యాండ్సమ్ హీరోల్లో టాప్ ప్లేస్‌లో ఉంటాడు హృతిక్ రోషన్ (Hrithik Roshan). క్రిష్, ధూమ్ 2, ఓం శాంతి ఓం సినిమాలతోపాటు పలు చిత్రాలతో సూపర్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. గతేడాది విక్రమ్ వేధ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. అయితే భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. చాలా కాలంగా సరైన బ్రేక్ కోసం ఎదురుచూస్తున్న హృతిక్ రోషన్ తాజాగా సిద్దార్థ్ ఆనంద్ దర్శకత్వంలో స్పిరిట్ ఆఫ్ ఫైటర్ (Spirit Of Fighter) మూవీలో నటిస్తున్నాడు.
బాలీవుడ్ భామ దీపికా పదుకొనే (Deepika Padukone) ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. తాజాగా ఈ సినిమా అప్డేట్ ఒకటి రివీల్ చేశారు మేకర్స్. ఇండియా ఫస్ట్ ఏరియల్ యాక్షన్ ఫిల్మ్‌గా రాబోతున్న ఈ మూవీకి సంబంధించి స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా రేపు ఉదయం 10 గంటలకు భారీ అప్డేట్ అందివ్వబోతున్నట్టు దీపికా పదుకొనే ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్టర్ రిలీజ్ చేసింది.
తాజా టాక్ ప్రకారం రేపు ఫస్ట్ లుక్ లాంఛ్ చేయబోతున్నారని బీటౌన్‌లో ఓ న్యూస్ హల్ చల్ చేస్తోంది. వినీలాకాశంలో ఫైటర్ జెట్స్ ఎగురుతూ.. దేశభక్తి ఉప్పొంగిపోయేలా కనిపిస్తున్న తాజా లుక్ నెట్టింట వైరల్ అవుతోంది. తొలిసారి హృతిక్ రోషన్, దీపికా పదుకొనే క్రేజీ కాంబో సిల్వర్ స్క్రీన్‌పై మెరువనుండటంతో అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి. ఈ ఏడాది పఠాన్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్టందుకున్నాడు సిద్దార్థ్ ఆనంద్. పఠాన్ తర్వాత సిద్దార్థ్ ఆనంద్ మరోసారి దీపికాపదుకొనేను హీరోయిన్గా తీసుకోవడంతో హిట్టు గ్యారంటీ అని చెబుతున్నారు ట్రేడ్ విశ్లేషకులు.
Spirit Of Fighter అప్డేట్..
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

