Spirit Of Fighter | ఫైటర్ ప్రమోషన్స్‌లో హృతిక్ రోషన్.. ట్రెండింగ్‌లో వీడియో
Spirit Of Fighter | బాలీవుడ్ హ్యాండ్ సమ్ హీరో హృతిక్ రోషన్ (Hrithik Roshan) బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్నాడు. చాలా కాలంగా సరైన బ్రేక్ కోసం ఎదురుచూస్తున్న హృతిక్ రోషన్ తాజాగా సిద్దార్థ్ ఆనంద్ దర్శకత్వంలో స్పిరిట్ ఆఫ్ ఫైటర్ (Spirit Of Fighter) మూవీలో నటిస్తున్నాడు.
Spirit Of Fighter | బాలీవుడ్ హ్యాండ్ సమ్ హీరో హృతిక్ రోషన్ (Hrithik Roshan) బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్నాడు.
గతేడాది విక్రమ్ వేధ సినిమాతో ప్రేక్షకుల ముందుకురాగా.. ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయింది. అయితే భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. చాలా కాలంగా సరైన బ్రేక్ కోసం ఎదురుచూస్తున్న హృతిక్ రోషన్ తాజాగా సిద్దార్థ్ ఆనంద్ దర్శకత్వంలో స్పిరిట్ ఆఫ్ ఫైటర్ (Spirit Of Fighter) మూవీలో నటిస్తున్నాడు.
వయాకామ్ 18 స్టూడియోస్-మార్ఫ్లిక్స్ పిక్చర్స్ సంయుక్త నిర్మాణంలో వస్తున్న ఈ చిత్రానికి సిద్దార్థ్ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్నాడు. 2024 జనవరి 25న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ నేపథ్యంలోవిదేశాల్లో ప్రమోషన్స్‌తో బిజీగా ఉన్నాడు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. ఇండియా మొట్టమొదటి ఏరియల్ డ్రామాగా ప్రేక్షకుల ముందుకొస్తున్న ఈ చిత్రంలో అనిల్ కపూర్, దీపికా పదుకొనే (Deepika Padukone) కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ మూవీ టీజర్‌ను డిసెంబర్ 7న విడుదల చేయనున్నట్టు ప్రకటించారు మేకర్స్.
వినీలాకాశంలో ఫైటర్ జెట్స్ ఎగురుతూ.. దేశభక్తి ఉప్పొంగిపోయేలా కనిపిస్తున్న ఫైటర్ లుక్ ఇప్పటికే నెట్టింట వైరల్ అవుతోంది. తొలిసారి హృతిక్ రోషన్, దీపికా పదుకొనే క్రేజీ కాంబో సిల్వర్ స్క్రీన్‌పై కలిసి కనిపించనుండటంతో క్యూరియాసిటీ పెరగడమే కాదు.. అంచనాలు కూడా ఆకాశాన్నంటుతున్నాయి. ఈ ఏడాది పఠాన్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్టందుకున్నాడు సిద్దార్థ్ ఆనంద్. పఠాన్ తర్వాత సిద్దార్థ్ ఆనంద్ మరోసారి దీపికాపదుకొనేను హీరోయిన్గా తీసుకోవడంతో హిట్టు గ్యారంటీ అని చెబుతున్నారు ట్రేడ్ విశ్లేషకులు.
Want this craze again🔥 #Fighter pic.twitter.com/81o67xWq9C
— Ansh (@ansh_0123) November 27, 2023
Bas kuch pal intejar h,uske baad gadar hoga 🔥🔥🔥#Fighter #HrithikRoshanpic.twitter.com/nSEu29aPDz
— ᴿᴬᴹᴮᴼ 🅵🅸🅶🅷🆃🅴🆁 (@rambo_SATYA_) December 3, 2023
#Fighter#ElectionResults
Lets go #Dunki #srk #jawan #Prabhas 📷 📷 #PrashanthNeel #Tiger3 #skf #SalmanKhan #KatrinaKaif #AnimalMovie #ANIMAL #Salaar 📷 📷 #SalaarCeaseFire 📷 #snow #U17WC #AnimalTheMovie #MelodySalaar $portal @Portalcoin pic.twitter.com/IoNRWsQBMT— shiv |✨OVERWORLD (@Shivkum61957461) December 3, 2023
Spirit Of Fighter అప్డేట్..
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘స్పెషల్’ పెట్టకుండానే బాదుడు.. బస్ పాయింట్లలో కనిపించని రెగ్యులర్ బస్సులు!
Cyber Attack | సైబర్ ‘సెక్యూరిటీ’ ఏది?.. రాష్ట్ర ప్రభుత్వ వెబ్సైట్లపై యథేచ్ఛగా దాడులు
పాడి, కోళ్ల పరిశ్రమపై కరువు పంజా.. పశుసంవర్ధక శాఖ మాజీ డైరెక్టర్ స్పెషల్ ఇంటర్వ్యూ
Stock Market Tips | స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారా? ముందుగా ఈ విషయాలు తెలుసుకోండి
Israel Elections | నెతన్యాహు భవితవ్యం ఏంటో.. రేపే ఇజ్రాయెల్ పార్లమెంట్ ఎన్నికలు
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

