ఈ ఏడాది ‘దసరా’ చిత్రంతో భారీ విజయాన్ని దక్కించుకున్నారు హీరో నాని. ప్రస్తుతం ఆయన తన 30వ చిత్రం ‘హాయ్ నాన్న’లో నటిస్తున్న విషయం తెలిసిందే. తాజా సమాచారం ప్రకారం నాని తెలుగు, తమిళ భాషల్లో ఓ సినిమా చేయబోతున్నట్లు తెలిసింది. దీనికి ‘డాన్’ ఫేమ్ సిబి చక్రవర్తి దర్శకత్వం వహిస్తారని సమాచారం.
తమిళంలో శివకార్తికేయన్ నటించిన ‘డాన్’ చిత్రంతో మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు దర్శకుడు సిబి చక్రవర్తి. ఇటీవలే ఆయన నానికి ఓ కథను వినిపించాడని, వైవిధ్యమైన సబ్జెక్ట్ కావడంతో ఆయన వెంటనే గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారని అంటున్నారు. ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో రానుందని సమాచారం.