హీరో మంచు మనోజ్ ఆరేండ్ల విరామం తర్వాత ‘వాట్ ది ఫిష్’ పేరుతో కొత్త చిత్రాన్ని ప్రకటించారు. ఈ చిత్రాన్ని సిక్స్ సినిమాస్, ఏ ఫిల్మ్ బై వీ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. వరుణ్ కోరుకొండ దర్శకత్వం వహిస్త్తున్నారు. శుక్రవారం ఈ సినిమా ప్రకటన సందర్భంగా దర్శకుడు వరుణ్ మాట్లాడుతూ…‘డార్క్ కామెడీ చిత్రమిది. థ్రిల్లింగ్ అంశాలతో కూడిన ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కించబోతున్నాం. కెనడా, టొరంటోలలో 75 రోజుల పాటు షూటింగ్కు ప్లాన్ చేస్తున్నాం. వివిధ భాషల్లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మంచి ప్యాడింగ్ ఉండబోతున్నది’ అన్నారు. మంచు మనోజ్ సోషల్ మీడియా ద్వారా స్పందిస్తూ…‘చాలా రోజుల తర్వాత కొత్త చిత్రాన్ని ప్రకటించడం సంతోషంగా ఉంది. సినిమాలు చేయకున్నా నాపై మీ అభిమానం తగ్గలేదని ఆశిస్తున్నా’ అని పేర్కొన్నారు.