Dil raju Dreams | ఆయన రన్నింగ్ రాజు.. నిర్మాత దిల్ రాజుపై అనిల్ రావిపూడి ప్రశంసలు
Anil Ravi Pudi | ప్రముఖ నిర్మాత దిల్ రాజుపై టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి ప్రశంసలు కురిపించారు. దిల్ రాజు అనే పేరు కంటే అతడిని 'రన్నింగ్ రాజు అని పిలిస్తే ఇంకా బాగుంటుందని అతడికి సెట్ అవుతుందని అభిప్రాయపడ్డారు.
Anil Ravi Pudi | ప్రముఖ నిర్మాత దిల్ రాజుపై టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి ప్రశంసలు కురిపించారు. దిల్ రాజు అనే పేరు కంటే అతడిని ‘రన్నింగ్ రాజు అని పిలిస్తే ఇంకా బాగుంటుందని అతడికి సెట్ అవుతుందని అభిప్రాయపడ్డారు. కొత్త టాలెంట్ను బయటకు తీసుకురావాలి అనే నేపథ్యంలో నిర్మాత దిల్ రాజు ‘దిల్ రాజు డ్రీమ్స్’ ప్రారంభించిన విషయం తెలిసిందే. దీనిపై మాట్లాడుతూ.. అనిల్ ఒక స్పెషల్ వీడియోను పంచుకున్నారు.
దిల్ రాజుతో తన 10 ఏండ్ల రిలేషన్షిప్ని గుర్తుచేసుకుంటూ.. నా మొదటి సినిమా ‘పటాస్’ తర్వాత దిల్ రాజు నిర్మాణంలోనే ‘సుప్రీమ్’ సినిమా చేశాను. అలా మొదలైన ఈ ప్రయాణం.. ఎఫ్2, ఎఫ్3, రాజా ది గ్రేట్, సంక్రాంతికి వస్తున్నాం విజయవంతంగా సాగుతుంది. దిల్ రాజు ఎప్పుడూ ఒకే చోట ఆగిపోరు. నిరంతరం కొత్తదనం కోసం పరుగులు పెడుతూనే ఉంటారు. అందుకే ఆయనకు దిల్ రాజు అని కాకుండా ‘రన్నింగ్ రాజు’ అని పేరు పెడితే సరిగ్గా సరిపోతుందంటూ అనిల్ తనదైన శైలిలో చెప్పుకోచ్చాడు.
అలాగే చిత్ర పరిశ్రమలో అన్ని రకాల సినిమాలను నిర్మించిన దిల్ రాజు.. ఇప్పుడు కొత్త వారికి అవకాశాలు కల్పించాలనే సంకల్పంతో ‘దిల్ రాజు డ్రీమ్స్’ వేదికను తీసుకొస్తున్నారని అనిల్ పేర్కొన్నారు. ఈ ప్రయత్నం అద్భుత విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని అనిల్ రావిపూడి శుభాకాంక్షలు తెలిపారు. కాగా, ‘దిల్ రాజు డ్రీమ్స్’ వెబ్సైట్ను ఈ సాయంత్రం 6:30 గంటలకు ప్రారంభించనున్నారు. హైదరాబాద్లోని జేఆర్సీ కన్వెన్షన్లో ఈ కార్యక్రమం జరగనుంది. ఈ వెబ్సైట్ ఆవిష్కరణ కార్యక్రమానికి యువ హీరో విజయ్ దేవరకొండ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.
He knows what it takes to Build a Blockbuster…❤️🔥
And today he backs a platform that builds future filmmakers 🔥@AnilRavipudi sends his warmest wishes to @DilRajuDreams and reminisces about his journey with #DilRaju garu ❤️#DilRajuDreams pic.twitter.com/0b8ra9Z379
— Sri Venkateswara Creations (@SVC_official) June 28, 2025
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
దూదేకుల స్థితిగతులపై ప్రత్యేక సర్వే
ఖాళీలు 2,125.. భర్తీ 429 మాత్రమే.. యూనివర్సిటీల్లో టీచింగ్ పోస్టుల భర్తీపై సర్కార్ నిర్లక్ష్యం
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

