Sundaram Master teaser | ఆదివాసీలు ఇంగ్లీష్‌లో మాట్లాడితే.. ఫన్‌గా సుందరం మాస్టర్ టీజర్
Sundaram Master teaser | టాలీవుడ్ కమెడియన్ హర్ష చెముడు (Harsha chemudu) టైటిల్ రోల్లో నటిస్తున్న చిత్రం సుందరం మాస్టర్ (Sundaram Master). తాజాగా సుందరం మాస్టర్ టీజర్‌ను లాంఛ్ చేశారు మేకర్స్.
Sundaram Master teaser | టాలీవుడ్ కమెడియన్ హర్ష చెముడు (Harsha chemudu) టైటిల్ రోల్లో నటిస్తున్న చిత్రం సుందరం మాస్టర్ (Sundaram Master). కళ్యాణ్ సంతోష్ డైరెక్ట్ చేస్తున్నాడు. ఇటీవలే హర్ష చెముడు ఆదివాసీలతో సుందరం మాస్టర్ గెటప్‌లో ఆదివాసీ మహిళలు, పురుషులు, చిన్నారులతో కలిసి దిగిన గ్రూప్ ఫొటో ఫస్ట్ లుక్ పోస్టర్ నెట్టింట్లో హల్చల్ చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా సుందరం మాస్టర్ టీజర్‌ను లాంఛ్ చేశారు మేకర్స్.
వైజాగ్‌లో ఏర్పాటు చేసిన టీజర్ లాంఛింగ్ ఈవెంట్లో హీరో సాయిధరమ్ తేజ్, డైరెక్టర్లు చందూమొండేటి, సుధీర్ వర్మ పాల్గొన్నారు. హర్ష చెముడు ఆదివాసీలకు ఏబీసీడీలు నేర్పించే సన్నివేశాలతో షురూ అయింది టీజర్. పాఠాలు నేర్పించేందుకు వచ్చిన సుందరం మాస్టర్‌కు ఆదివాసులంతా ఇంగ్లీష్‌లో మాట్లాడుతూ షాకిస్తుంటారు.
ఇంతకీ అక్కడ ఏం జరుగుతుందో తెలియక అయోమయంలో పడిపోతాడు హర్ష. టైటిల్ క్యాప్షన్‌లో 1930ని కొట్టేస్తూ.. 2023లో ఆదివాసీలు ఎలా ఉన్నారనే ఫన్ యాంగిల్‌ను సినిమాలో చూపించబోతున్నట్టు టీజర్‌తో అర్థమవుతోంది. సినిమా పక్కా ఫన్ ఎంటర్టైనర్గా ఉండబోతుందని టీజర్‌లోని సన్నివేశాలు చెబుతున్నాయి. ఈ మూవీలో దివ్య శ్రీపాద ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది.
ఈ చిత్రాన్ని రవితేజ టీమ్ వర్క్స్, గోల్డెన్ మీడియా బ్యానర్లపై రవితేజ, సుధీర్‌కుమార్ కుర్రు సంయుక్తంగా తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి శ్రీచరణ్ పాకాల సంగీతం అందిస్తున్నాడు. ఎప్పుడూ ఏదో కామెడీ టచ్ ఉండే పాత్రలో కనిపించే హర్ష చెముడు ఈ సారి ఎలాంటి కథాంశంతో రాబోతున్నాడన్నది ప్రస్తుతానికి సస్పెన్స్ నెలకొంది.
సుందరం మాస్టర్ టీజర్..
సుందరం మాస్టర్ ఫస్ట్ లుక్..
Immensely pleased to announce our next in @RTTeamWorks 🤗
Here is the FUST LUK of #SM alias #SundaramMaster
Our boy @harshachemudu made it INTERNET to INTERNATIONAL @SudheerKurru @kalyansanthosh8 @itswetha14@NambuShalini @SricharanPakala @GOALDENMEDIA pic.twitter.com/zkuS4ZIRo0
— Ravi Teja (@RaviTeja_offl) June 22, 2023
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

