ఏడుగురు మహిళల జీవితాలు, వారి భావోద్వేగాలు ప్రధానంగా రూపొందిస్తున్న చిత్రం ‘హ్యాపీ జర్నీ’. అభిరామ్ నాయుడు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని బాలాజీ గుత్తా, కౌశిక్ రెడ్డి నిర్మిస్తున్నారు. అన్నపూర్ణమ్మ, ఆమని, ఝాన్సీ, పాయల్ రాధాకృష్ణ, జినిషా అలీశెట్టి, రూపాశ్రీనివాస్, సునయన ప్రధాన పాత్రధారులు.
బుధవారం ఫస్ట్‌లుక్ విడుదల చేశారు. భిన్న తరాల మహిళలు, వారి స్నేహం, ఆప్యాయతలకు అద్దం పట్టే చిత్రమిదని, జీవిత ప్రయాణంలో వారు ఎదుర్కొన్న అనుభవాల సమాహారంగా ఆకట్టుకుంటుందని మేకర్స్ తెలిపారు. యూరప్‌లోని పారిస్, మౌంట్పెలియర్ వంటి అందమైన ప్రదేశాల్లో చిత్రీకరణ జరిపామని, త్వరలో థియేట్రికల్ రిలీజ్ చేస్తామని నిర్మాతలు చెప్పారు. ఈ చిత్రానికి కెమెరా: మణికందన్ సుబ్రమణియన్, సంగీతం: శేఖర్‌చంద్ర, రచన-దర్శకత్వం: అభిరామ్ నాయుడు.