Sai Pallavi | క్యూట్ యాక్టింగ్‌కు ప్రేక్షకులు ఫిదా.. హ్యాపీ బర్త్ డే టు సాయిపల్లవి
Sai Pallavi | డ్యాన్సర్‌గా, నటిగా తన అందం, అభినయంతో కోట్లాది మంది హృదయాల్లో చెరగని ముద్ర వేసుకుంది సాయిపల్లవి (Sai Pallavi). నేడు 31వ పుట్టినరోజు ( Birthday) వేడుకలు జరుపుకుంటోంది సాయిపల్లవి .
Sai Pallavi | సినీ ఇండస్ట్రీలో స్టార్డమ్ సంపాదించుకున్న నటీనటులు చాలా మందే ఉన్నారు. కానీ న్యాచురల్ యాక్టింగ్‌తో డిఫరెంట్ ఫ్యాన్ బేస్, క్రేజ్, స్టార్ డమ్ సంపాదించుకున్న యాక్టర్లు మాత్రం తక్కువే. ఈ జాబితాలో టాప్ ప్లేస్‌లో ఉంటుంది సాయిపల్లవి (Sai Pallavi). మెడిసిన్ పూర్తి చేసిన ఈ భామ డ్యాన్సర్‌గా, నటిగా తన అందం, అభినయంతో కోట్లాది మంది హృదయాల్లో చెరగని ముద్ర వేసుకుంది.
సాయిపల్లవి నేడు 31వ పుట్టినరోజు ( Birthday) వేడుకలు జరుపుకుంటోంది. ఈ సందర్భంగా అభిమానులు, నెటిజన్లు, మూవీ లవర్స్ సాయిపల్లవికి శుభాకాంక్షల వర్షం కురిపిస్తున్నారు. #HBDSaiPallavi హ్యాష్ ట్యాగ్‌తో సాయిపల్లవికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు నెటిజన్లు. ఫిదా సినిమాతో తెలుగు ప్రేక్షకులను ఫిదా చేసిన సాయిపల్లవి.. తక్కువ టైంలోనే సౌందర్య తర్వాత మళ్లీ అంతటి క్రేజ్ సంపాదించుకుందనడంలో ఎలాంటి సందేహం లేదు.
గ్లామరస్ రోల్ అయినా, ఇరగదీసే డ్యాన్స్ అయినా, పర్ఫార్మెన్స్ ఓరియెంటెడ్ పాత్రలోనైనా సులభంగా లీనమైపోయే టాలెంట్ సాయిపల్లవి సొంతం. మలయాళ హిట్ ప్రాజెక్ట్ ప్రేమమ్ సినిమాతో హీరోయిన్గా తొలి ఎంట్రీతోనే ఇండస్ట్రీని షేక్ చేసింది సాయిపల్లవి. ఈ చిత్రంలో సాయిపల్లవి లుక్స్‌కు పడిపోని మూవీ లవర్స్ ఉండరంటే అతిశయోక్తి కాదు. సాయిపల్లవి నానితో కలిసి నటించిన శ్యామ్ సింగరాయ్‌తో పాన్ ఇండియా ప్రేక్షకులను కూడా పలుకరించింది .
గతేడాది తెలుగులో విరాటపర్వం, గార్గి సినిమాల్లో నటించింది సాయిపల్లవి. గార్గి సినిమాకు ఉత్తమ నటిగా పలు అవార్డులు అందుకుంది. బడగ ఫ్యామిలీకి చెందిన సాయిపల్లవి స్వస్థలం నీల్గిరి జిల్లాలోని కోటగిరి. మెడిసిన్ పూర్తి చేసిన ఈ భామ వృత్తిపరమైన కమిట్మెంట్స్ తో మెడికల్ ప్రాక్టీషనర్‌గా కెరీర్ సాగించలేకపోయింది. ఈ బ్యూటీ కొత్త సినిమా ప్రకటించాల్సి ఉంది.
సాయిపల్లవి క్యూట్ స్టిల్స్‌పై ఓ లుక్కేయండి మరి..

( Photos : Instagram )

( Photos : Instagram )


Sai Pallavi

Sai Pallavi
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rice Scam | రూ.15 బియ్యం.. రూ.100కు అమ్మకం.. రేషన్ బియ్యం రీసైక్లింగ్ దందా బట్టబయలు!
Anupama Parameswaran | ఎయిర్‌పోర్టులో అనుపమ పరమేశ్వరన్‌కు చేదు అనుభవం.. ఫొటోల పేరుతో అలా చేశారంటూ ఆవేదన!
Number Plates | BOSS, IGOD, 1, 3, 9.. నంబర్ ప్లేట్లపై కొత్త ట్రెండ్.. ఆర్టీఏ అధికారుల కొరడా!
Aadarsha Kutumbam | వెంకటేష్ ‘ఆదర్శ కుటుంబం’ ట్రైలర్ వచ్చేసింది.. త్రివిక్రమ్ మార్క్ డైలాగ్స్‌తో అదరగొట్టిన విక్టరీ స్టార్!
Hyderabad | రాజేంద్రనగర్‌లో మారణాయుధాల కలకలం.. రూ.4లక్షల విలువ చేసే గంజాయి, పిస్టోళ్లు స్వాధీనం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

