Good Bad Ugly | ఓటీటీలోకి అజిత్ ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే.!
Good Bad Ugly | తమిళ అగ్ర నటుడు అజిత్ కుమార్ నటించిన ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ చిత్రం తాజాగా ఓటీటీ అనౌన్స్‌మెంట్‌ను పంచుకుంది.
Good Bad Ugly | తమిళ అగ్ర నటుడు అజిత్ కుమార్ నటించిన బ్లాక్ బస్టర్ చిత్రం ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’. ‘మార్క్ ఆంటోనీ’ విజయం తర్వాత దర్శకుడు అధిక్ రవిచంద్రన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించగా.. అజిత్‌తో పాటు త్రిష, అర్జున్ దాస్, ప్రసన్న, ప్రభు, యోగి బాబు, సునీల్ తదితరులు ఈ సినిమాలో నటించారు. జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం అందించగా, మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మించింది.
ఏప్రిల్ 10న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం కేవలం 20 రోజుల్లోనే రూ.250 కోట్లకు గ్రాస్ వసూళ్లను సాధించింది. ఇక బాక్సాఫీస్ వద్ద హిట్‌గా నిలిచిన ఈ చిత్రం తాజాగా ఓటీటీలోకి రాబోతుంది. ప్రముఖ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్‌లో ఈ చిత్రం మే 08 నుంచి తమిళంతో పాటు తెలుగు, మలయాళం, హిందీ, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్ కాబోతున్నట్లు చిత్రబృందం తెలిపింది. ఈ సందర్భంగా కొత్త పోస్టర్‌ను పంచుకుంది.
చాలా కాలం తర్వాత అజిత్ పూర్తిస్థాయి మాస్ కమర్షియల్ చిత్రంలో నటించడంతో అభిమానులు ఆనందోత్సాహాల్లో మునిగిపోయారు. ఈ సినిమా అజిత్ ఫ్యాన్స్‌కు పండగలాంటిదని, అతని పాత సినిమాల సంభాషణలు, సన్నివేశాలను ప్రస్తావిస్తూ ఉత్సాహభరితంగా కనిపించిన అజిత్‌ను తెరపై చూడటం థ్రిల్లింగ్ అనుభవమని అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు.
Avaru rules ah avare break pannitu velila varaaru na… sambhavam iruku. 8 May anniku sambhavam irukku. 🔥
Watch Good Bad Ugly on Netflix, out 8 May in Tamil, Hindi, Telugu, Kannada and Malayalam#GoodBadUglyOnNetflix pic.twitter.com/BkISFURnff— Netflix India South (@Netflix_INSouth) May 3, 2025
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

