Gods and Soldiers Traiser | మాస్ , యాక్షన్ ఎలిమెంట్స్‌తో ‘గాడ్స్ అండ్ సోల్జర్స్’ ట్రైజర్
Gods and Soldiers Traiser | గాడ్స్ అండ్ సోల్జర్స్ ట్రైజర్‌ను ప్రముఖ టాలీవుడ్ డైరెక్టర్ హరీష్ శంకర్ తన సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్ ద్వారా విడుదల చేశారు. మాస్ అండ్ ఎమోషన్స్, యాక్షన్ అంశాలతో ఈ ట్రైసర్ అందర్ని ఆకట్టుకుంటోంది.
Gods and Soldiers Traiser | తమిళ, తెలుగు భాషల్లో వస్తోన్న చిత్రం ‘గాడ్స్ అండ్ సోల్జర్స్’.ప్రముఖ దర్శకుడు, సినిమాటోగ్రాఫర్ విజయ్ మిల్టన్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మూవీ కమర్షియల్ మాస్ ఎంటర్టైనర్గా ఇప్పటికే ప్రిరీలీజ్ బజ్ తెచ్చుకుంది. గాడ్స్ అండ్ సోల్జర్స్ ట్రైజర్‌ను ప్రముఖ టాలీవుడ్ డైరెక్టర్ హరీష్ శంకర్ తన సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్ ద్వారా విడుదల చేశారు.
మాస్ అండ్ ఎమోషన్స్, యాక్షన్ అంశాలతో ఈ ట్రైసర్ అందర్ని ఆకట్టుకుంటోంది. ఈ సందర్భంగా దర్శకుడు విజయ్ మెల్టన్ మాట్లాడుతూ.. మా ట్రైజర్‌ను విడుదల చేసి మాకు ప్రోత్సాహం అందించిన దర్శకుడు హరీష్ శంకర్‌కు ధన్యవాదాలు. భారీ స్థాయిలో, భావోద్వేగాల నేపథ్యంతో తెరకెక్కుతున్న ఈ చిత్రం, వాస్తవిక కథనంతో పాటు వాణిజ్య అంశాలను మేళవించిన సినిమాటిక్ అనుభూతిని ప్రేక్షకులకు అందించనుంది. ఈ చిత్రంలో మంచి టాలెంటెడ్ నటీనటులు సరికొత్త అవతారంలో కనిపంచబోతున్నారన్నారు.
ఆరి అరుజునన్ తొలిసారి పోలీస్ పాత్రలో కనిపించనున్నారు. రాజ్ తరుణ్ ఈ చిత్రంతో తమిళంలో అడుగుపెడుతున్నారు. భరత్ కీలక భావోద్వేగ పాత్రలో నటిస్తున్నారు. అమూ అభిరామి, కిశోర్ ప్రాధాన్యత ఉన్న పాత్రల్లో కనిపించనున్నారు. సినిమా కోసం అందరూ శారీరకంగా, భావోద్వేగంగా కష్టపడ్డారు. ఇక ప్రత్యేక ఆకర్షణగా స్వతంత్ర సంగీత కళాకారుడు వేధన్ కూడా ఒక ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నారు. తన ప్రత్యేక గాత్రం, సామాజిక అంశాలపై ఆధారిత గీతాలతో యువతలో గుర్తింపు పొందిన వేధన్ పాల్గొనడం ద్వారా చిత్రానికి సాంస్కృతిక, సంగీత పరమైన ప్రత్యేకత కలగనుంది.
విభిన్న ప్రదేశాల్లో విస్తృతంగా షూటింగ్ జరుపుకుంది. ప్రస్తుతం చిత్రబృందం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో నిమగ్నమైంది. రఫ్ నోట్ ప్రొడక్షన్ నిర్మిస్తున్న ఈ చిత్రం యాక్షన్, భావోద్వేగం, సామాజిక అంశాల సమ్మేళనంగా తమిళ, తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకునేలా రూపొందుతోంది’ అన్నారు. చిత్రీకరణ పూర్తిచేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణనంతర పనులను శరవేగంగా జరుపుకుంటోంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Karthik Subbaraj | చిరంజీవి గారికి కథ చెప్పాను.. ఇంకా ఫైనలైజ్ కాలేదు: డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్
ఆడపడుచుల ఆత్మగౌరవం.. ప్రకృతి ప్రేమకు ప్రతీక బతుకమ్మ : పద్మా దేవేందర్ రెడ్డి
Crops | ట్యాంకర్లతో నీటి కొనుగోలు.. అయినా తీరని సాగునీటి కష్టాలు
Chiranjeevi | ‘జైలర్ 2’ సినిమాటోగ్రాఫర్‌కు చిరంజీవి అభినందనలు.. ‘కాకా’ సెట్స్‌లో ప్రత్యేక వేడుక!
Madhya Pradesh | మధ్యప్రదేశ్‌లో భక్తులపై దూసుకెళ్లిన భారీ ట్రక్కు 12 మంది మృతి.. పలువురికి తీవ్ర గాయాలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

