Gangubai kathiawadi OTT | ఓటీటీలోకి ‘గంగుబాయి కతియావాడి’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Gangubai kathiawadi On OTT | సినీరంగంలో నటినటులు సినిమాలలో ఎన్ని పాత్రలు చేసినా వాళ్ళ మదిలో జీవితంలో గుర్తుండి పోయే పాత్ర ఒకటి చేయాలని ఎంతగానో ఆశ పడుతుంటారు. అందులో ముఖ్యంగా నటిమణులు లేడి ఓరియెంటెడ్ పాత్రలను చేయాలని ఎక్కువగా ఆశ పడుతుంటారు. ఎందుకంటే అలాంటి పాత్రలు ఒక్కటి చేసిన ఆ పాత్ర ప్రేక్షకులలో చిరస్థాయిగా నిలిచిపోతుందనే నమ్మకం. ఇక ఇటీవలే బాలీవుడ్లో ఆలీయా భట్ ప్రధాన పాత్రలో నటించిన ‘గంగూబాయి కతియావాడి’ ఒకటి. ముంభైలోని కామతిపుర రాజ్యానికి మాఫియా క్వీన్‌గా ఎదిగిన గంగూబాయి పాత్రలో ఆలీయాభట్ నటించింది. ఈ చిత్రంలో ఆలీయా నటన వర్ణనాతీతం. ప్రేక్షకుల నుంచి విమర్శకుల వరకు ఈమె నటనకు ప్రశంసలు జల్లులు కురిపించారు. సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం డిజిటల్ స్ట్రీమింగ్కు సిద్ధమైంది.
గంగూబాయి కతియావాడి చిత్రం ఫిబ్రవరి 25న విడుదలై భారీ కలెక్షన్లను సాధించింది. ఈ చిత్రంతో ఆలీయాభట్ 100కోట్ల క్లబ్లో చేరింది. ఇప్పటివరకు ఈ చిత్రం దాదాపు 130 కోట్ల నెట్ కలెక్షన్లు సాధించి రికార్డు సృష్టించింది. ఇక ఈ సినిమా ఓటీటీ విడుదల తేదీని చిత్ర బృందం తాజాగా ప్రకటించింది. ఈ చిత్రం ఏప్రిల్ 26నుంచి ‘నెట్‌ఫ్లిక్స్’లో హిందీతో పాటు తెలుగులోనూ స్ట్రీమింగ్ కానుంది. ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగన్ కీలకపాత్రలో నటించాడు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘పండుటాకులకు పింఛన్ కరువు’
Satyajit Ray Film Institute: నసీరుద్దీన్ షా వ్యాఖ్యలను తప్పుపట్టిన సత్యజిత్ రే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్
OTT Movies | ఈ వారం ఓటీటీలోకి కొత్త సినిమాలు, వెబ్‌సిరీస్‌లు.. ‘తెల్లకాగితం’ నుంచి ‘ఎస్సై యుగంధర్’ వరకు ఫుల్ లిస్ట్ ఇదే..!
DMK Ex-Minister Arrested | ప్రైవేట్ స్కూల్స్ నుంచి వంద కోట్లు లంచం ఆరోపణలు.. డీఎంకే మాజీ మంత్రి అరెస్ట్
Rahul Gandhi | ప్రధాని మోదీతో ఆ మాట చెప్పండి నిరసనలు 30 సెకన్లలో ఆగిపోతాయి.. వ్యాపారుల లేఖపై రాహుల్‌గాంధీ..!
ట్రెండింగ్ వార్తలు
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?

