Gangubai kathaiwadi | ఓటీటీలోకి ‘గంగుబాయి కఠియావాడి’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియాభట్ ప్రధాన పాత్రలో తెరక్కెక్కిన లేటెస్ట్ చిత్రం ‘గంగూబాయి కఠియావాడి’. సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఫిబ్రవరి 25న విడుదలైంది.
Gangubai kathaiwadi | బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియాభట్ ప్రధాన పాత్రలో తెరక్కెక్కిన లేటెస్ట్ చిత్రం ‘గంగూబాయి కఠియావాడి’. సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఫిబ్రవరి 25న విడుదలైంది. మొదటి షో నుంచే ఈ చిత్రం పాజిటీవ్ రివ్యూలను తెచ్చుకుని బాక్సాఫీస్ దగ్గర మంచి కలెక్షన్లను రాబడుతుంది. ఈ చిత్రంలో ఆలియా నటనకు ప్రేక్షకులే కాకుండా విమర్శకుల నుంచి మంచి ప్రశంసలు దక్కాయి. కామాతిపుర రాజ్యానికి గంగుబాయి మాఫియా క్వీన్‌గా ఎలా ఎదిగింది అనే కథాంశంతో ఈ చిత్రం తెరకెక్కింది. తాజాగా ఈ చిత్రం డిజిటల్లోకి రానున్నట్లు తెలుస్తుంది.
‘గంగుబాయి కఠియావాడి’ చిత్రాన్ని మార్చి 25 నుంచి ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తుంది. ఈ చిత్రం విడుదలైన నాలుగు వారాల తర్వాత డిజిటల్ స్ట్రీమింగ్ చేయాలని నెట్ఫ్లీక్స్ సంస్థ ఈ చిత్ర మేకర్స్‌తో డీల్ కుదిరించుకుందని సమాచారం. గంగూబాయి కతియావాడి చిత్రంతో అలియా వంద కోట్ల క్లబ్లో చేరింది. ఇప్పటివరకు ఈ చిత్రం 107కోట్ల కలెక్షన్లను సాధించింది.ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగన్ కీలకపాత్రలో నటించాడు. లేటెస్ట్గా ఆలియా భట్ నెట్‌ఫ్లిక్స్ సంస్థ తెరకెక్కిస్తున్న ‘హర్ట్ ఆఫ్ స్టోన్’తో హాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వబోతుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘పండుటాకులకు పింఛన్ కరువు’
Satyajit Ray Film Institute: నసీరుద్దీన్ షా వ్యాఖ్యలను తప్పుపట్టిన సత్యజిత్ రే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్
OTT Movies | ఈ వారం ఓటీటీలోకి కొత్త సినిమాలు, వెబ్‌సిరీస్‌లు.. ‘తెల్లకాగితం’ నుంచి ‘ఎస్సై యుగంధర్’ వరకు ఫుల్ లిస్ట్ ఇదే..!
DMK Ex-Minister Arrested | ప్రైవేట్ స్కూల్స్ నుంచి వంద కోట్లు లంచం ఆరోపణలు.. డీఎంకే మాజీ మంత్రి అరెస్ట్
Rahul Gandhi | ప్రధాని మోదీతో ఆ మాట చెప్పండి నిరసనలు 30 సెకన్లలో ఆగిపోతాయి.. వ్యాపారుల లేఖపై రాహుల్‌గాంధీ..!
ట్రెండింగ్ వార్తలు
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?

