Gam Gam Ganesha | మైత్రి మూవీ మేకర్స్ చేతికి ‘గం..గం..గణేశా’ నైజాం హక్కులు
Anand Devarakonda | టాలీవుడ్ యువ నటుడు ఆనంద్ దేవరకొండ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘గం..గం..గణేశా’ (Gam Gam Ganesha). ఫన్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని హై-లైఫ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై కేదార్ సెలగంశెట్టి, వంశీ కారుమంచి నిర్మిస్తున్నారు.
Anand Devarakonda | టాలీవుడ్ యువ నటుడు ఆనంద్ దేవరకొండ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘గం..గం..గణేశా’ (Gam Gam Ganesha). ఫన్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని హై-లైఫ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై కేదార్ సెలగంశెట్టి, వంశీ కారుమంచి నిర్మిస్తున్నారు. ఉదయ్ శెట్టి ఈ సినిమాతో డైరెక్టర్‌గా ఎంట్రీ ఇస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి టీజర్‌తో పాటు ట్రైలర్లు విడుదల చేయగా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ఈ చిత్రం మే 31న ప్రేక్షకుల ముందుకు రానుండటంతో సెన్సార్ కూడా కంప్లీట్ చేసుకుంది. సెన్సార్ బోర్డ్ సభ్యులు ఈ సినిమాకు యూ/ఏ(U/A) సర్టిఫికెట్‌ను అందించారు.
ఇదిలావుంటే.. తాజాగా ఈ సినిమా డిస్ట్రిబ్యూషన్ హాక్కులు భారీ ధరకు అమ్ముడైనట్లు తెలుస్తుంది. ఈ సినిమా నైజాం డిస్ట్రిబ్యూషన్ హాక్కులను టాలీవుడ్ టాప్ ప్రోడక్షన్ మైత్రి మూవీ మేకర్స్ (Mythri Movie Makers) దక్కించుకోగా ఏపీ, కర్ణాటక హక్కులను ధీరజ్ మొగిలినేని ఎంటర్టైన్మెంట్ (Dheeraj Mogilineni Enertainment) దక్కించుకుంది. కామెడీతో పాటు రాయలసీమ బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా వస్తుండటంతో మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. ప్రగతి శ్రీవాస్తవ, ఎన్ సారిక ఈ చిత్రంలో కథానాయికలుగా నటిస్తుండగా.. ఇమ్మాన్యుయేల్, వెన్నెల కిషోర్, రాజ్ అర్జున్, సత్యం రాజేష్ తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

