జూన్ 14న గద్దర్ సినిమా అవార్డుల వేడుక
గద్దర్ తెలంగాణ సినిమా అవార్డులను జూన్ 14న ప్రదానం చేయనున్నట్లు సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. హైదరాబాద్ హైటైక్స్లో ఘనంగా నిర్వహించే వేడుకలో అవార్డులను అందజేస్తామన్నారు.
గద్దర్ తెలంగాణ సినిమా అవార్డులను జూన్ 14న ప్రదానం చేయనున్నట్లు సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. హైదరాబాద్ హైటైక్స్లో ఘనంగా నిర్వహించే వేడుకలో అవార్డులను అందజేస్తామన్నారు. ఈ వివరాలను తెలియజేసేందుకు మంగళవారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఎఫ్డీసీ ఛైర్మన్, ప్రముఖ నిర్మాత దిల్‌రాజు, గద్దర్ అవార్డుల జ్యూరీ ఛైర్మన్ నటి జయసుధ పాల్గొన్నారు. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ ‘ ఈ ఏడాది నుంచి ఈ బృహత్తర కార్యక్రమానికి మళ్లీ శ్రీకారం చుట్టాం. ఇక నుంచి ప్రతి ఏడాదీ ఉత్తమ చలనచిత్రాలకు.. వివిధ కేటగిరీలలో ప్రతిభ కనబరిచిన కళాకారులకు ప్రభుత్వ అవార్డులను అందిస్తాం. గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డుల పట్ల ప్రభుత్వానికి ఓ స్పష్టమైన విధానం ఉంది.
ప్రతి ఒక్కరూ ఈ అవార్డుల గురించి మాట్లాడుకునేలా, భవిష్యత్ తరాలకు స్ఫూర్తిగా ఉండేలా.. కనీవినీ ఎరుగని రీతిలో ఈ వేడుకను నిర్వహిస్తాం’ అని తెలిపారు. గద్దర్ పేరిట ఇస్తున్న ఈ అవార్డులపై ఎన్ని విమర్శలు వచ్చినా, ఆయన పేరుతోనే అవార్డులు ఇస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి పేర్కొన్నారు. 2024లో సెన్సార్‌బోర్డ్ సర్టిఫికెట్ పొందిన చిత్రాలకు అవార్డులను అందించడానికి ఈ నెలలో దరఖాస్తులను కోరారు. దాంతో వివిధ విభాగాలకు గాను, దర్శక, నిర్మాతల నుంచి 76 దరఖాస్తులు, వ్యక్తిగత అవార్డుల విభాగాలకు గాను 1172 నామినేషన్లు రావడం జరిగింది. ఈ నామినేషన్లంటినీ పరిశీలించి అవార్డులు ఇవ్వడానికి సినీ నటి జయసుధ అధ్యక్షతన 15మందితో కూడిన ఓ జ్యూరీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ నెలరోజులూ ఈ సినిమాలన్నింటినీ తిలకించి, వాటిలో ఉత్తమ చిత్రాలను, అందులోని వివిధ కేటరిగీలలో ప్రతిభ కనబరచిన కళాకారులను జ్యూరీ అవార్డుల కోసం ఎంపిక చేయబోతున్నది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘పండుటాకులకు పింఛన్ కరువు’
Satyajit Ray Film Institute: నసీరుద్దీన్ షా వ్యాఖ్యలను తప్పుపట్టిన సత్యజిత్ రే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్
OTT Movies | ఈ వారం ఓటీటీలోకి కొత్త సినిమాలు, వెబ్‌సిరీస్‌లు.. ‘తెల్లకాగితం’ నుంచి ‘ఎస్సై యుగంధర్’ వరకు ఫుల్ లిస్ట్ ఇదే..!
DMK Ex-Minister Arrested | ప్రైవేట్ స్కూల్స్ నుంచి వంద కోట్లు లంచం ఆరోపణలు.. డీఎంకే మాజీ మంత్రి అరెస్ట్
Rahul Gandhi | ప్రధాని మోదీతో ఆ మాట చెప్పండి నిరసనలు 30 సెకన్లలో ఆగిపోతాయి.. వ్యాపారుల లేఖపై రాహుల్‌గాంధీ..!
ట్రెండింగ్ వార్తలు
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?

