Athi manoharam | అయ్యప్ప భక్తుల మధ్యలో పోలీస్ ఆఫీసర్.. ఆకట్టుకుంటున్న మోహన్ లాల్ కొత్త సినిమా లుక్!
Athimanoharam | మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ వరుస ప్రయోగాలతో బాక్సాఫీస్ వద్ద తన జోరును కొనసాగిస్తున్నారు
Athimanoharam | మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ వరుస ప్రయోగాలతో బాక్సాఫీస్ వద్ద తన జోరును కొనసాగిస్తున్నారు. గతేడాది ‘తుడరుమ్’ చిత్రంలో ట్యాక్సీ డ్రైవర్‌గా, ‘హృదయపూర్వం’లో ప్రేమికుడిగా వైవిధ్యమైన నటనతో మెప్పించిన ఆయన, ఇప్పుడు ఖాకీ చొక్కా ధరించి పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. తరుణ్ మూర్తి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ భారీ చిత్రానికి ‘అతిమనోహరం’ అనే ఆసక్తికరమైన టైటిల్‌ను ఖరారు చేశారు. ‘తుడరుమ్’ వంటి విజయవంతమైన సినిమా తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో వస్తున్న రెండో చిత్రం కావడంతో దీనిపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
మలయాళీల నుతన సంవత్సర పండుగ అయిన ‘విషు’ (Vishu) రోజున ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ను విడుదల చేస్తూ చిత్ర బృందం అధికారిక ప్రకటన చేసింది. ఈ పోస్టర్లో శబరిమలకు వెళ్తున్న అయ్యప్ప స్వామి భక్తుల మధ్య మోహన్ లాల్ పోలీస్ యూనిఫాంలో గంభీరంగా కనిపిస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. ఇందులో ఆయన ‘లవ్ లాజన్’ అనే విభిన్నమైన పాత్రను పోషిస్తుండటం విశేషం. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమాతో పాటు మోహన్ లాల్ చేతిలో ‘పేట్రియాట్’, అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ‘దృశ్యం 3’ వంటి క్రేజీ ప్రాజెక్టులు కూడా ఉండటంతో మాలీవుడ్ వర్గాల్లో సందడి నెలకొంది.
ഏവർക്കും അതിമനോഹരമായ വിഷു ആശംസകൾ ✨🌼#HappyVishu #Athimanoharam #TharunMoorthy #Ashiqusman pic.twitter.com/4brb0yWOKr
— Mohanlal (@Mohanlal) April 15, 2026
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

