పవిత్రమైన ప్రేమను చూస్తారు!
‘ఈ ఐదారేళ్లలో మీ దగ్గరి నుంచి ఎంతో ప్రేమను సంపాదించుకున్నా. ఎత్తుపల్లాలు, ఒడిదుడుకులు చూశాను. మంచి సినిమాలు చేసి మీ ఆదరణ పొందాలని నిత్యం ప్రయత్నిస్తున్నా’ అని అన్నారు హీరో కిరణ్ అబ్బవరం.
‘ఈ ఐదారేళ్లలో మీ దగ్గరి నుంచి ఎంతో ప్రేమను సంపాదించుకున్నా. ఎత్తుపల్లాలు, ఒడిదుడుకులు చూశాను. మంచి సినిమాలు చేసి మీ ఆదరణ పొందాలని నిత్యం ప్రయత్నిస్తున్నా’ అని అన్నారు హీరో కిరణ్ అబ్బవరం. ఆయన నటిస్తున్న తాజా చిత్రం ‘చెన్నై లవ్‌స్టోరీ’ ఈ నెల 24న ప్రేక్షకుల ముందుకురానుంది. రవి నంబూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఎస్కేఎన్, సాయిరాజేశ్ నిర్మిస్తున్నారు.
బుధవారం హీరో కిరణ్ అబ్బవరం జన్మదినం. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ పైవిధంగా స్పందించారు. ఈ సినిమాలో పవిత్రమైన ప్రేమంటే ఏమిటో చూస్తారని, ఒక అమ్మాయిని ఇంత గొప్పగా ప్రేమించవొచ్చా అని ప్రతి ఒక్కరూ అనుకుంటారని, కథలోని మాస్ అంశాలు కూడా ఆకట్టుకుంటాయని కిరణ్ అబ్బవరం పేర్కొన్నారు.
‘బేబీ’ తరహాలోనే స్ట్రైకింగ్ ఎలిమెంట్స్ ఉన్న లవ్‌స్టోరీ ఇదని, నైజాంలో మైత్రీ సంస్థ ద్వారా విడుదల చేయబోతున్నామని నిర్మాత ఎస్కేఎన్ తెలిపారు. ఈ సినిమాలో హీరోహీరోయిన్లు స్టీవెన్, విని పాత్రలతో ప్రతి ఒక్కరూ కనెక్ట్ అవుతారని దర్శకుడు రవి నంబూరి అన్నారు. శ్రీగౌరి ప్రియ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: మణిశర్మ, కథ: సాయిరాజేష్, సహ నిర్మాత: ధీరజ్ మొగిలినేని, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: రవి నంబూరి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Athulya Chandra | డాక్టర్‌ను ట్రాప్ చేసి రూ.3.5 లక్షల దోపిడీ.. ‘మత్తు వదలరా’ నటి అరెస్ట్.!
US Stocks: కుప్పకూలిన స్టాక్‌మార్కెట్లు.. ట్రిలియన్ డాలర్లు కోల్పోయిన టెకీ కంపెనీలు
కళ్లకు కూలింగ్ గ్లాసెస్.. బ్లాక్ అవుట్‌ఫిట్‌లో కీర్తి సురేశ్ అదిరిపోయే లుక్
TTD Chairman | టీటీడీ సాధికారిక మండలి ఛైర్మనుగా ముద్దాడ రవిచంద్ర ప్రమాణం
కేసీఆర్ ఉన్నప్పుడు ఇట్ల లేకుండే..! హరీశ్ రావు ఎదుట కన్నీళ్లు పెట్టుకున్న రైతులు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

