Drishyam 3 | ‘దృశ్యం 3’ బాక్సాఫీస్ సునామీ.. 8 రోజుల్లోనే రూ. 400 కోట్లు!
Drishyam 3 | బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్ నటించిన సంచలన ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ 'దృశ్యం 3: ది కన్‌క్లూజన్' బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టిస్తోంది.
బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్ నటించిన సంచలన ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ‘దృశ్యం 3: ది కన్‌క్లూజన్’ బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టిస్తోంది. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ సినిమా, కేవలం 8 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 400 కోట్ల మార్క్‌ను దాటేసింది. రెండో శుక్రవారం రోజే భారత్‌లో రూ. 14.50 కోట్లు రాబట్టడంతో, ప్రపంచవ్యాప్త గ్రాస్ కలెక్షన్లు రూ. 407 కోట్లకు చేరుకున్నాయి. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం, దీనితో మన దేశంలోనే సినిమా మొత్తం గ్రాస్ కలెక్షన్లు రూ. 312 కోట్లకు, నెట్ కలెక్షన్లు రూ. 260 కోట్లకు చేరాయి. ఇక విదేశీ మార్కెట్లలో (ఓవర్సీస్) శుక్రవారం నాటికి మరో రూ. 6 కోట్లు రావడంతో, అంతర్జాతీయ వసూళ్లు రూ. 95 కోట్లకు పెరిగాయి.
విడుదలకు ముందే అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారానే రూ. 27 కోట్లు రాబట్టిన ఈ చిత్రం, అజయ్ దేవగన్ కెరీర్లో బిగ్గెస్ట్ ఓపెనింగ్గా నిలిచింది. ఇక ఫస్ట్ వీకెండ్లో శనివారం రూ. 53.50 కోట్లు, ఆదివారం రూ. 61 కోట్లతో ఊహించని వసూళ్లు సాధించింది. తొలి వారం ముగిసేసరికి ఇండియాలోనే రూ. 245.50 కోట్ల నెట్ కలెక్షన్లను సొంతం చేసుకుంది. వీకెండ్స్ తర్వాత వర్కింగ్ డేస్‌లో కూడా కలెక్షన్లు తగ్గకపోవడం విశేషం.
అజయ్ దేవగన్ కెరీర్లో ఇప్పటివరకు అత్యధిక వసూళ్లు సాధించిన ‘తానాజి: ది అన్సంగ్ వారియర్’ (2020) చిత్రం డొమెస్టిక్ నెట్ కలెక్షన్ రూ. 279.59 కోట్లుగా ఉంది. ప్రస్తుతం ‘దృశ్యం 3’ నెట్ కలెక్షన్ రూ. 260 కోట్లకు చేరడంతో, ఆ రికార్డును అధిగమించడానికి కొద్ది దూరంలోనే ఉంది. సినిమా కలెక్షన్లు చూస్తుంటే త్వరలోనే ‘తానాజి’ రికార్డు బద్దలవడం ఖాయంగా కనిపిస్తోంది. ఇక అభిషేక్ పాఠక్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో టబు, ప్రకాష్ రాజ్, జైదీప్ అహ్లావత్ మరియు శ్రియా సరన్ ప్రధాన తారాగణంగా నటించారు. స్టార్ స్టూడియో 18 మరియు పనోరమ స్టూడియోస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Drishyam 3 | ‘దృశ్యం 3’ బాక్సాఫీస్ సునామీ.. 8 రోజుల్లోనే రూ. 400 కోట్లు!
High Blood Pressure | రక్తపోటు అదుపులోకి రావడం లేదా? అసలు కారణాలు ఇవే..
Ranabaali | ‘రణబాలి’కి టికెట్ ధరలే ప్లస్ పాయింట్.. ‘జైలర్ 2’తో పోటీలో విజయ్ దేవరకొండకు కలిసొచ్చే అంశమిదే!
Rohan Rane: మైనర్ అమ్మాయిల లైంగిక వేధింపులు.. ఫ్రాన్స్‌లో భారతీయుడికి 20 ఏళ్ల జైలుశిక్ష
Comrade Kalyan | శ్రీ విష్ణు ‘కామ్రేడ్ కళ్యాణ్’కు మంచి ఓపెనింగ్స్.. తొలిరోజే రూ.4 కోట్లకు పైగా వసూళ్లు!
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

