Dragon | ‘డ్రాగన్’ గ్లింప్స్ సెన్సేషన్.. ఇండియన్ సినిమా రికార్డును సెట్ చేసిన ఎన్టీఆర్ మూవీ!
Dragon | మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా, దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రం డ్రాగన్ ఇప్పటికే ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలను సృష్టించింది. తారక్ పుట్టినరోజు సందర్భంగా చిత్ర బృందం విడుదల చేసిన అవైటెడ్ గ్లింప్స్ ఇప్పుడు సోషల్ మీడియా, సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
Dragon | మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా, దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రం డ్రాగన్ ఇప్పటికే ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలను సృష్టించింది. తారక్ పుట్టినరోజు సందర్భంగా చిత్ర బృందం విడుదల చేసిన అవైటెడ్ గ్లింప్స్ ఇప్పుడు సోషల్ మీడియా, సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఇన్నాళ్లు ‘NTR-Neel’ అనే వర్కింగ్ టైటిల్‌తో పిలవబడిన ఈ ప్రాజెక్ట్‌కు డ్రాగన్ అనే టైటిల్‌ను ప్రకటించడమే కాకుండా, గ్లింప్స్ ద్వారా సినిమాపై మరింత హైప్ పెంచారు. “డెవిల్ జన్మించాడు” అనే ట్యాగ్‌లైన్‌తో విడుదలైన ఈ వీడియోలో ఎన్టీఆర్‌ను పూర్తిగా కొత్త అవతార్‌లో చూపించడం అభిమానులను ఆశ్చర్యపరిచింది.
ముఖ్యంగా గ్లింప్స్‌లో కనిపించిన విజువల్స్, మాస్ ఎలిమెంట్స్, డార్క్ టోన్, ఎన్టీఆర్ స్క్రీన్ ప్రెజెన్స్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. దీంతో విడుదలైన కొద్ది గంటల్లోనే వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇప్పుడు ఈ గ్లింప్స్ మరో భారీ రికార్డును కూడా సొంతం చేసుకున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. విడుదలైన తొలి 24 గంటల్లోనే 64 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించి ఇండియన్ సినిమా స్థాయిలో ఆల్‌టైమ్ రికార్డు నమోదు చేసినట్లు వెల్లడించింది. ఈ సంఖ్య ఇప్పుడు సినీ అభిమానుల మధ్య చర్చనీయాంశంగా మారింది.
ఈ స్పందన చూసిన అభిమానులు “డ్రాగన్ ఊచకోత మొదలైంది” అంటూ సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. సినిమా విడుదలకు ఇంకా సమయం ఉన్నప్పటికీ, కేవలం గ్లింప్స్‌తోనే ఈ స్థాయి స్పందన రావడం ఆసక్తికరంగా మారింది. ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన రుక్మిణి వసంత్ హీరోయిన్గా నటిస్తుండగా, సంగీతాన్ని రవి బర్సూర్ అందిస్తున్నారు. భారీ నిర్మాణ విలువలతో ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ మరియు ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇప్పటికే గ్లింప్స్‌తో భారీ అంచనాలు పెంచుకున్న డ్రాగన్ రాబోయే రోజుల్లో మరిన్ని రికార్డులు సృష్టించే అవకాశాలు కనిపిస్తున్నాయని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. అభిమానులు కూడా ఇప్పుడు తదుపరి అప్డేట్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

