కడుపుబ్బా నవ్వించే ‘దొంగ నా కొడుకు’
‘లిటిల్ హార్ట్స్' చిత్రంతో ప్రేక్షకులను అలరించారు యువ హీరో మౌళి తనూజ్ప్రశాంత్. ఆయన మరోమారు ప్రేక్షకులకు నవ్వుల్ని పంచేందుకు సిద్ధమయ్యారు. ఆయన నటిస్తున్న క్రైమ్ కామెడీ చిత్రం ‘దొంగ నా కొడుకు’ నవంబర్ 13న విడుదలకానుంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం ద్వారా శ్రీను కంబాల దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. బుధవారం టీజర్‌ను విడుదల చేశారు. బీటెక్ చదువుని మధ్యలో ఆపేసిన ఈశ్వర్... ఎలాగైనా బాగా డబ్బు సంపాదించాలనే ప్రయత్నాల్లో ఉంటాడు.
‘లిటిల్ హార్ట్స్’ చిత్రంతో ప్రేక్షకులను అలరించారు యువ హీరో మౌళి తనూజ్ప్రశాంత్. ఆయన మరోమారు ప్రేక్షకులకు నవ్వుల్ని పంచేందుకు సిద్ధమయ్యారు. ఆయన నటిస్తున్న క్రైమ్ కామెడీ చిత్రం ‘దొంగ నా కొడుకు’ నవంబర్ 13న విడుదలకానుంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం ద్వారా శ్రీను కంబాల దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. బుధవారం టీజర్‌ను విడుదల చేశారు. బీటెక్ చదువుని మధ్యలో ఆపేసిన ఈశ్వర్… ఎలాగైనా బాగా డబ్బు సంపాదించాలనే ప్రయత్నాల్లో ఉంటాడు.
ఈ క్రమంలో అనుకోకుండా ఓ నేరంలో చిక్కుకుంటాడు. దాని నుంచి బయటపడేందుకు అతను చేసే ప్రయత్నాలతో టీజర్ ఆద్యంతం నవ్వుల్ని పంచింది. ఈ సినిమా టైటిల్‌ని కొందరు నెగెటివ్‌గా చూస్తున్నారని, సినిమా చూసిన తర్వాత ఎందుకు పెట్టామో అర్థమవుతుందని దర్శకుడు శ్రీను కంబాల తెలిపారు. ఆద్యంతం హాస్యప్రధానంగా సాగే కథ ఇదని నిర్మాత వై.రవిశంకర్ పేర్కొన్నారు. ఈ చిత్రానికి సంగీతం: సింజిత్ యెర్రమిల్లి, నిర్మాతలు: నవీన్ యెర్నేని, వై.రవిశంకర్, రచన-దర్శకత్వం: శ్రీను కంబాల.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

