ఈ ఫలితమే కీలకం
నాయికలు సాధ్యమైనంత స్లిమ్‌గా అందంగా ఉండాలని ప్రయత్నిస్తుంటారు. భోజన ప్రియులైన తారలకు ఇలా ఉండటం ఓ యజ్ఞం లాంటిదే. కళ్ల ముందే రుచికరమైన ఆహారాలు కనిపిస్తున్నా, కొనగలిగి, తినగలిగే శక్తి ఉన్నా చూస్తూ ఉండిపోవాల్సిందే. తింటే లావైపోయి, అవకాశాలపై ప్రభావం చూపిస్తుంది.
నాయికలు సాధ్యమైనంత స్లిమ్‌గా అందంగా ఉండాలని ప్రయత్నిస్తుంటారు. భోజన ప్రియులైన తారలకు ఇలా ఉండటం ఓ యజ్ఞం లాంటిదే. కళ్ల ముందే రుచికరమైన ఆహారాలు కనిపిస్తున్నా, కొనగలిగి, తినగలిగే శక్తి ఉన్నా చూస్తూ ఉండిపోవాల్సిందే. తింటే లావైపోయి, అవకాశాలపై ప్రభావం చూపిస్తుంది. ఈ సందర్భాన్ని ప్రతి రోజూ ఎదుర్కొంటానని చెబుతున్నది అందాల తార దివ్యాంశ కౌషిక్. ఈ ఉత్తరాఖండ్ నాయిక ‘టక్కర్’ అనే తమిళ మూవీతో తెరంగేట్రం చేసింది.
ఆ తర్వాత ‘మజిలీ’ సినిమాతో తెలుగు తెరపై అడుగుపెట్టింది. వెబ్ మూవీ ‘ద వైఫ్’ మంచి పేరు తీసుకురాగా..ఇప్పుడు రవితేజ సరసన ‘రామారావు ఆన్ డ్యూటీ’లో కనిపించబోతున్నది. తన కెరీర్‌కు కీలకమైన ఈ సినిమా ఫలితం మీద దివ్యాంశ చాలా ఆశలు పెట్టుకుంది. తనో ఫుడ్ లవర్ అని చెప్పుకునే ఈ భామ…ఆహారం తినకుండా కాపాడుకోవడమే తను చేస్తున్న పెద్ద సాధనగా చెప్పుకుంది. ఆమె మాట్లాడుతూ…‘ముస్సోరిలో చదువుకునేప్పుడు నచ్చిన ఆహారం తినేదాన్ని. అప్పుడు 20 కిలోలు పెరిగాను. తోటి విద్యార్థులు కామెంట్ చేసేవారు. సినిమాల్లోకి వద్దామని ఆలోచనలో ఉన్నప్పుడు నా బరువు పెద్ద ఆటంకం అయ్యింది. యష్ రాజ్ సంస్థలో శిక్షణ తీసుకుని బరువు తగ్గాను. ఢిల్లీలో ఫుడ్ చాలా బాగుంటుంది. హైదరాబాద్ వస్తే ముందు నేను ఆర్డర్ చేసేది బిర్యానీ. అయితే ఎంత తినాలో తప్పకుండా నియంత్రించుకుంటా’ అని చెప్పింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Odisha teacher 14 days in ditch | కొండచరియలు విరుగడంతో గుంతలో చిక్కుకున్న టీచర్.. 14 రోజుల తర్వాత గుర్తించిన కాపరి
Watch: బైకులతో సింహాన్ని అడ్డుకున్న అటవీ శాఖ సిబ్బంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video
Newborn dies due to DJ Sound | డీజే శబ్దానికి గుండె ఆగి.. నవజాత శిశువు మృతి
Watch: ప్రెస్మీట్లో ఒక వ్యక్తిని ముద్దుపెట్టుకున్న బీజేపీ ఎమ్మెల్యే.. ఏఐ వీడియో అని ఆయన భార్య ఆరోపణ

