Venky Atluri | ఆయనతో పోల్చడం గౌరవంగా భావిస్తున్నా
‘తొలిప్రేమ’తో ప్రేక్షకుల ప్రేమను గెలుచుకొని.. సర్, లక్కీభాస్కర్ విజయాలతో తెలుగుతోపాటు తమిళ, మలయాళ ప్రేక్షకుల మన్ననలను కూడా పొందారు దర్శకుడు వెంకీ అట్లూరి. రీసెంట్గా ‘విశ్వనాథ్ అండ్ సన్స్' లాంటి డీసెంట్ లవ్‌స్టోరీతో దక్షిణాది సినీరంగంలో మరోసారి దర్శకునిగా విజయకేతనం ఎగురవేశారాయన.
‘తొలిప్రేమ’తో ప్రేక్షకుల ప్రేమను గెలుచుకొని.. సర్, లక్కీభాస్కర్ విజయాలతో తెలుగుతోపాటు తమిళ, మలయాళ ప్రేక్షకుల మన్ననలను కూడా పొందారు దర్శకుడు వెంకీ అట్లూరి. రీసెంట్గా ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ లాంటి డీసెంట్ లవ్‌స్టోరీతో దక్షిణాది సినీరంగంలో మరోసారి దర్శకునిగా విజయకేతనం ఎగురవేశారాయన. సూర్య, మమితాబైజు జంటగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో, సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య నిర్మించిన ఈ చిత్రం వసూళ్ల పరంగా 200కోట్ల మైలురాయికి చేరువవుతూ.. తెలుగు, తమిళ రాష్ర్టాల్లో విజయవంతంగా దూసుకుపోతున్నది. ఈ సందర్భంగా గురువారం వెంకీ అట్లూరి హైదరాబాద్‌లో విలేకరులతో ముచ్చటించారు.
ఈ కథను 2022లో రాశా. ఇది సూర్యని దృష్టిలో పెట్టుకొని రాసిన కథ కాదు. ముందు నిర్మాతలు ఓకే చేశారు. హీరో కోసం వెతుకుతున్న తరుణంలో సూర్య మంచి ఫ్యామిలీ స్టోరీ కోసం చూస్తున్నారన్న విషయం తెలిసింది. దాంతో ఈ కథ ఆయనకు వినిపించాం. సూర్యకు కథ నచ్చడంతో ఆయన శారీరక భాషకు తగ్గట్టుగా కొన్ని మార్పులు చేయడం జరిగింది. అనవసరపు కామెడీ, అక్కర్లేని కమర్షియల్ అంశాలూ లేకుండా నిజాయితీ ఈ కథను చెబుదామని సూర్య చెప్పారు. ఆయన చెప్పినట్టే నిజాయితీగా సినిమా తీశాం. ముఖ్యంగా ైక్లెమాక్స్ విషయంలో జాగ్రత్తలు తీసుకున్నాం. కథలోని ఏ పాత్ర పడిపోకుండా జాగ్రత్త పడ్డాం. విడుదలకు కొద్ది రోజుల ముందే సూర్య సినిమా చూశారు. తాను ఏదైతే నమ్మారో, అదే తెరపై కనిపించిందని ఆయన సంతోషపడ్డారు.
వయసు వ్యాత్యాసం ఉన్న బంధంపై కథ రాయాలని ముందు అనుకున్నాను. 40ఏండ్లు వచ్చినా హీరో పెళ్లి చేసుకోలేదంటే దానికి బలమైన కారణం ఉండాలి. కారణం దొరికింది. దాని చుట్టూ కథ అల్లాను. నా దృష్టిలో మనుషులెవరూ చెడ్డవారు కాదు. పరిస్థితుల వల్ల ఒక్కొక్కరూ ఒక్కోలా ప్రవర్తిస్తుంటారు. అదే విషయాన్ని ఈ సినిమాలో చెప్పాను. తెలుగుతోపాటు తమిళంలోనూ ఈ సినిమాకు మంచి స్పందన వస్తున్నది. ఇక్కడ కంటే తమిళంలో సినిమాకు లాంగ్విటీ ఎక్కువ ఉంటుంది. ఆ విధంగా చూసుకుంటే తమిళనాట ‘విశ్వనాథన్ అండ్ సన్స్’ చాలా పెద్ద హిట్.
సినిమాల్లోకి రావడానికి నాకు స్ఫూర్తి మణిరత్నం, త్రివిక్రమ్. ఈ సినిమాలోని నా రైటింగ్ చూసిన వారంతా త్రివిక్రమ్‌గారితో పోలుస్తున్నారు. ఇది గౌరవంగా భావిస్తున్నా. ఈ సినిమా నిర్మాణంలో ఆయన కూడా భాగస్వామే. సితార సంస్థలోని ప్రతి సినిమానూ ఆయన చూస్తారు. చిన్నచిన్న మార్పులు చేర్పులు సూచిస్తారు. కానీ ఈ సినిమా విషయంలో మాత్రం ఆయన ఎలాంటి మార్పులు చెప్పలేదు. సినిమా అనేది ఎడిట్ టేబుల్‌పై బెటర్ అవుతుంది. ఎడిటర్‌కి స్వేచ్ఛ ఇస్తే, ఖచ్ఛితంగా మంచి అవుట్‌పుట్ వస్తుంది. ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ విషయంలో అదే జరిగింది. త్వరలో సితార సంస్థలోనే మరో సినిమా చేయబోతున్నా. ఆ వివరాలు త్వరలో చెబుతా.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Amitabh Bachchan | అమితాబ్ బచ్చన్ 84వ పుట్టినరోజు వేడుకలు.. ముంబైలోని జల్సా వద్ద కోలాహలం
Donald Trump | రష్యా- అమెరికా డీజిల్ ఒప్పందాన్ని తప్పుబట్టిన జెలెన్స్కీ.. ఉక్రెయిన్‌కు కొత్త అధ్యక్షుడు అవసరమన్న ట్రంప్
Bathukamma | బతుకమ్మ పండుగకు కనీస ఏర్పాట్లు చేయని కాంగ్రెస్ సర్కార్.. వీడియో
Patnam Narendar Reddy | పట్టభద్రులు ఓటర్ల జాబితాలో తమ పేర్లను నమోదు చేయించుకోవాలి : మాజీ ఎమ్మెల్యే పట్నం
Maganur | షార్ట్ సర్య్కూట్‌తో ఇళ్లు దగ్ధం..పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

