Rahul Ravindran | ‘అర్జున్ రెడ్డి’తో… ‘ది గర్ల్‌ఫ్రెండ్’ కి పోలిక.. స్పందించిన దర్శకుడు
Rashmika Mandanna | నేషనల్ అవార్డు గ్రహీత, దర్శకుడు రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో రాబోతున్న తాజా చిత్రం 'ది గర్ల్‌ఫ్రెండ్'. ఈ సినిమాలో రష్మిక మందన్నా ప్రధాన పాత్రలో నటిస్తుంది.
The Girlfriend | నేషనల్ అవార్డు గ్రహీత, దర్శకుడు రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో రాబోతున్న తాజా చిత్రం ‘ది గర్ల్‌ఫ్రెండ్’. ఈ సినిమాలో రష్మిక మందన్నా ప్రధాన పాత్రలో నటిస్తుంది. ఈ చిత్రం నవంబర్ 07న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అయితే ఈ సినిమా ట్రైలర్ విడుదలైన తర్వాత దీనిని కల్ట్ మూవీ ‘అర్జున్ రెడ్డి’ తో పోలుస్తూ సోషల్ మీడియాలో చర్చ మొదలైన విషయం తెలిసిందే. దీనిపై తాజాగా దర్శకుడు రాహుల్ స్పందించాడు. అర్జున్ రెడ్డి చిత్రానికి ఈ గర్ల్ ఫ్రెండ్ చిత్రానికి పోలికలు లేవని తెలిపాడు.
”అర్జున్ రెడ్డి ఒక కల్ట్ సినిమా. అది సినీ పరిశ్రమకు ఒక గేమ్ ఛేంజర్. నా సినిమా దానికి దగ్గరగా కూడా లేదు. ఇది ఒక చిన్న చిత్రం. నిజం చెప్పాలంటే సోషల్ మీడియాలో పోలికలు వచ్చేవరకు నాక్కూడా ఆ ఆలోచన రాలేదు. మేము కావాలనే ట్రైలర్‌ను నాన్-లీనియర్ పద్ధతిలో కట్ చేశాము. బహుశా ఆ ఎడిటింగ్ స్టైల్ వల్లే కొంతమందికి ‘అర్జున్ రెడ్డి’ వైబ్ వచ్చి ఉండవచ్చు. కానీ మా సినిమా పూర్తిగా వేరు” అని రాహుల్ రవీంద్రన్ స్పష్టం చేశారు. గర్ల్ ఫ్రెండ్ విషయానికి వస్తే.. ఈ సినిమాను గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై అల్లు అరవింద్ నిర్మిస్తుండగా.. కన్నడ నటుడు దీక్షిత్ శెట్టి కీలక పాత్రలో నటిస్తున్నాడు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఢిల్లీలో నిరసనలు.. తెలంగాణలో కేసులా?
మంటగలిసిన పేగుబంధం.. ఆరేండ్ల చిన్నారి కూతురును హుస్సేన్‌సాగర్‌లోకి విసిరిన మహిళ
ఓటర్ల మొగ్గు.. బీఆర్ఎస్ వైపు.. చాణక్య స్ట్రాటజీస్ ఎండీ ముకేశ్
వారంలోగా భూసేకరణ చేసి పరిహారమివ్వండి.. అమలుచేయకుంటే కోర్టు ధిక్కరణ చర్యలు తప్పవు
ముగిసిన స్పీకర్ ప్రసాద్‌కుమార్ బృందం యూరప్ పర్యటన
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

