O Bhama Ayyo Rama | ఓ భామ అయ్యో రామ’ చిత్రంలో హరీశ్ శంకర్ గెస్ట్ రోల్
O Bhama Ayyo Rama | వైవిధ్యమైన చిత్రాలతో అలరిస్తున్న యువ హీరో సుహాస్.. మరో అందమైన ప్రేమకథా చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నాడు. ఆ సినిమా పేరే ‘ఓ భామ అయ్యో రామ’. ఈ ప్రేమకథ చిత్రంతో మలయాళ నటి మాళవిక మనోజ్ (జో ఫేమ్) హీరోయిన్గా టాలీవుడ్‌కు పరిచయమవుతున్నది. ఈ సినిమాతో రామ్ గోధల దర్శకుడిగా మారాడు.
O Bhama Ayyo Rama | వైవిధ్యమైన చిత్రాలతో అలరిస్తున్న యువ హీరో సుహాస్.. మరో అందమైన ప్రేమకథా చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నాడు. ఆ సినిమా పేరే ‘ఓ భామ అయ్యో రామ’. ఈ ప్రేమకథ చిత్రంతో మలయాళ నటి మాళవిక మనోజ్ (జో ఫేమ్) హీరోయిన్గా టాలీవుడ్‌కు పరిచయమవుతున్నది. ఈ సినిమాతో రామ్ గోధల దర్శకుడిగా మారాడు. వీఆర్ పతాకంపై హరీశ్ నల్ల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ప్రముఖ కథానాయకుడు రానా దగ్గుబాటి స్పిరిట్ మీడియా ఈ చిత్రాన్ని విడుదల చేయనుంది. కాగా ఈ చిత్రంలో ప్రముఖ మాస్ దర్శకుడు హరీశ్ శంకర్ ఓ అతిథి పాత్రలో కనిపించబోతున్నాడు. సినిమాలో ఆయన గెస్ట్ రోల్ అందరిని సర్ప్రైజ్ చేస్తుంది. ఈ పాత్ర ఆయన చేస్తేనే బాగుంటుందని భావించిన మేకర్స్ హరీశ్ శంకర్‌ను ఒప్పించి ఆయన పాత్రకు సంబంధించిన షూటింగ్‌ను ఇటీవల పూర్తిచేశారు.
నిర్మాత హరీశ్ నల్ల మాట్లాడుతూ.. సుహాస్ కెరీర్‌కు మైలురాయిగా నిలిచే చిత్రంగా ఉంటుందని తెలిపారు. ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఓ బెస్ట్ క్వాలిటీ సినిమాను అందించబోతున్నామని పేర్కొన్నారు. ఈ చిత్రంలో సున్నితమైన ప్రేమ భావోద్వేగాలతో పాటు అంతకు మించిన ఫన్ ఉంటుందని చెప్పారు. ఈ చిత్రంలోని వినోదం ఆడియన్స్‌ను ఎంతో ఎంటర్టైన్ చేస్తుందనే నమ్మకం ఉందన్నారు. హరీష్ శంకర్‌ను అడ్గగానే మా చిత్రంలో అతిథి పాత్రను చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ వేసవిలో ఓ భామ అయ్యో రామ బెస్ట్ ఎంటర్ టైనర్ చిత్రంగా నిలుస్తుందనే నమ్మకం ఉందని అన్నారు.
ఈ చిత్రంలో సీనియర్ నటి అనితా హసనందిని, ఆలీ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ మనికందన్ అందించగా.. రథన్ స్వరాలు సమకూర్చారు. భవిన్ షా ఎడిటింగ్ బాధ్యతలు చేపట్టగా, బ్రహ్మ కడలి ప్రొడక్షన్ డిజైన్‌ను సమకూరుస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రం 2025 వేసవి లో ప్రేక్షకుల ముందుకు రానుంది.
నటీనటులు: సుహాస్, మాళవిక మనోజ్, అనితా హసనందిని, ఆలీ, బబ్లూ పృథ్వీ రాజ్, రవీందర్ విజయ్, మొయిన్
సాంకేతిక నిపుణులు:
రచయిత-దర్శకుడు: రామ్ గోధల
నిర్మాత: హరీష్ నల్ల, బ్యానర్: V ఆర్ట్స్
సంగీతం: రధన్
సినిమాటోగ్రఫీ: మనికందన్ S
ఎడిటింగ్: భవిన్ షా
ప్రొడక్షన్ డిజైన్: బ్రహ్మ కడలి
కాస్ట్యూమ్స్: అశ్వంత్ & ప్రతిభ
PRO: ఏలూరు శ్రీను – మడూరి మధు
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘సర్వభ్రష్ట ప్రభుత్వాన్ని మార్చేందుకు ప్రజలు సన్నద్ధం’
Srinidhi Shetty | బ్లాస్ట్ సినిమాతో ఎలాంటి కనెక్షన్ లేదు.. ‘ఆదర్శకుటుంబం’ హీరోయిన్ శ్రీనిధి శెట్టి
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
ఇరవెండి పంచాయతీ నిర్వహణపై డీపీవో అనూష ప్రశంస
Former Minister Talasani | ఓటరు నమోదు ముమ్మాటికీ ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలోనే జరగాలి : మాజీ మంత్రి జరగాలని తలసాని
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

