Dil Raju Dreams | ‘దిల్ రాజు డ్రీమ్స్’.. టాలెంట్ ఉన్న యువతకు దిల్ రాజు బంపర్ ఆఫర్!
Dil Raju Dreams | తెలుగు సినీ పరిశ్రమలో, యావత్ భారతీయ సినీ రంగంలో దిల్ రాజు పేరుకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు.
Dil Raju Dreams | తెలుగు సినీ పరిశ్రమలో, యావత్ భారతీయ సినీ రంగంలో దిల్ రాజు పేరుకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. తన మొదటి సినిమా పేరును ఇంటిపేరుగా మార్చుకున్న ఈ నిర్మాత, టాలెంట్‌ను గుర్తించడంలో దిట్ట. ఎంతోమంది హీరోలు, నటీనటులు, దర్శకులు, టెక్నీషియన్లను తెలుగు సినీ పరిశ్రమకు పరిచయం చేసిన దిల్ రాజు, ఇప్పుడు మరో ముందడుగు వేశారు. తెలుగు సినీ పరిశ్రమకు మరింత టాలెంట్‌ను అందించే ప్రయత్నంలో భాగంగా, ఆయన కొత్త ప్లాట్‌ఫామ్‌ను సిద్ధం చేశారు.
కొత్త ప్రతిభను సినీ పరిశ్రమకు పరిచయం చేయాలనే లక్ష్యంతో దిల్ రాజు తాజాగా దిల్ రాజు డ్రీమ్స్(Dil Raju Dreams) అనే ఆన్లైన్ ప్లాట్‌ఫామ్‌ను రూపొందించారు. తన కెరీర్ మొదలు నుంచి ఫ్రెష్ కంటెంట్, కొత్త టాలెంట్‌ను ప్రోత్సహించిన దిల్ రాజు, ఇప్పుడు ఈ ప్లాట్‌ఫామ్ ద్వారా యువ ప్రతిభావంతులకు అద్భుతమైన అవకాశాలు కల్పించనున్నారు. జూన్ నెల నుంచీ “దిల్ రాజు డ్రీమ్స్” ఆన్లైన్ పోర్టల్ అందుబాటులోకి రానుంది. ఈ ప్లాట్ఫామ్లో భాగం కావాలనుకునేవారు https://dilrajudreams.com/ లింక్‌పై క్లిక్ చేసి తమ వివరాలను నమోదు చేసుకోవచ్చని తెలిపాడు. వివరాలు నమోదు చేసుకున్న తర్వాత, దిల్ రాజు డ్రీమ్స్ బృందం స్వయంగా వారిని సంప్రదిస్తుంది. జూన్‌లో ఈ పోర్టల్ పూర్తిగా సిద్ధమైన తర్వాత, యువ ప్రతిభావంతులు తమ ఆలోచనలను ఈ బృందానికి నేరుగా తెలియజేయవచ్చు.
సరైన ప్లాట్‌ఫామ్ దొరకక, సినీ పరిశ్రమలో పరిచయాలు లేక, ఎవరిని ఎలా సంప్రదించాలో తెలియక ఎంతోమంది టాలెంట్ ఉన్నవారు ఇబ్బంది పడుతున్నారు. అలాంటి వారందరికీ ఇది నిజంగా ఒక గోల్డెన్ ఛాన్స్. టాలెంట్ ఉన్నవారు తమను తాము నిరూపించుకోవడానికి దిల్ రాజు స్థాపించినదే ఈ “దిల్ రాజు డ్రీమ్స్. సినిమాలు చేయాలనే ఆలోచన ఉన్నవారు, సినీ పరిశ్రమలో అడుగు పెట్టాలని కలలు కనేవారు, దిల్ రాజు డ్రీమ్స్ లింక్ ద్వారా రిజిస్టర్ చేసుకుని తమ కలను సాకారం చేసుకోవచ్చు. ఇది యువ టాలెంట్‌కు ఒక గొప్ప అవకాశం. ఇంకెందుకు ఆలస్యం? మీ టాలెంట్‌ను నిరూపించుకోవడానికి సిద్ధంగా ఉండండి!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
దూదేకుల స్థితిగతులపై ప్రత్యేక సర్వే
ఖాళీలు 2,125.. భర్తీ 429 మాత్రమే.. యూనివర్సిటీల్లో టీచింగ్ పోస్టుల భర్తీపై సర్కార్ నిర్లక్ష్యం
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

