ఈ ఫోటోలో రామ్ చరణ్ తో ఉన్న బుడ్డోడు ఎవరో తెలుసా..?

త్రిబుల్ ఆర్ సినిమాకి సంబంధించిన ఏ అప్డేట్ అయినా పండగ చేసుకుంటున్నారు అభిమానులు. ఈ క్రమంలోనే విడుదలైన రామ్ చరణ్ కొత్త స్టిల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అంతా బాగానే ఉంది.. కానీ ఈ ఫోటోలలో రామ్ చరణ్ తో కలిసి ఉన్న బుడ్డోడు ఎవరు అని ఆరా తీస్తున్నారు మెగా అభిమానులు. చరణ్ తో చాలా క్లోజ్ గా ప్రతి ఫోటోలో ఉన్నాడు ఆ కుర్రాడు. ముందు వాటిని చూసి ఎవరైనా సినిమా యూనిట్ కు సంబంధించిన అబ్బాయి ఉంటాడు అనుకున్నారు. కానీ కాదని తర్వాత తెలిసింది.
ఈ కుర్రాడు కూడా సినిమాలో నటుడు. త్రిబుల్ ఆర్ సినిమాలో ఒక కీలక పాత్ర చేస్తున్నాడు ఈ కుర్రాడు. కథ ప్రకారం అల్లూరి సీతారామరాజు ఈ కుర్రాడిను రక్షిస్తారు. ఇంతకు ముందే దీనికి సంబంధించిన కొన్ని సన్నివేశాలు చిత్రీకరించారు రాజమౌళి. మరికొన్ని మిగిలిపోవడంతో రామ్ చరణ్, చిన్న పిల్లాడు కాంబినేషన్ లో వచ్చే సీన్స్ షూట్ చేస్తున్నాడు దర్శక ధీరుడు. దీనికి సంబంధించిన లొకేషన్ స్టిల్స్ సోషల్ మీడియాలో విడుదలయ్యాయి. అందులో ఒకరితో ఒకరు ఆ సన్నివేశం గురించి మాట్లాడుకుంటున్నట్లు అనిపిస్తుంది.
ప్రస్తుతం రామ్ చరణ్ ఫోటోలు ఎంత వైరల్ అవుతున్నాయో.. ఈ బుడ్డోడి ఫోటోలు కూడా అంతే వైరల్ అవుతున్నాయి. రాజమౌళి సినిమా అంటే ఆ మాత్రం కాన్సన్ట్రేషన్ అందరికీ ఉంటుంది. పైగా గతంలో జక్కన్న సినిమాలో బాలనటులుగా చేసిన వాళ్ళు ఇప్పుడు హీరోలయ్యారు. ఇప్పటికే త్రిబుల్ ఆర్ షూటింగ్ మొత్తం పూర్తయింది. కేవలం రెండు పాటలు మాత్రమే బ్యాలెన్స్ ఉన్నాయి. వాటిని కూడా వీలైనంత త్వరగా పూర్తి చేయాలని రాజమౌళి భావిస్తున్నాడు. అంతే కాదు రెండు భాషలకు సంబంధించిన డబ్బింగ్ కార్యక్రమాలను కూడా పూర్తి చేశారు రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్. తెలుగుతో పాటు తమిళ మలయాళ హిందీ భాషల్లో ఓన్ డబ్బింగ్ చెబుతున్నారు చరణ్, తారక్. ఈ సినిమాలో అలియా భట్, అజయ్ దేవగన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- ram charan
- RRR
- still
RELATED ARTICLES
తాజా వార్తలు
కుమారుడితో కలిసి 18వ అంతస్తు నుంచి దూకిన మహిళ.. భర్త మళ్లీ పెళ్లి చేసుకోవాలంటూ లేఖ
Omar Abdullah | జమ్ముకశ్మీర్ సీఎం కొత్త ప్రయాణం.. జర్నలిస్టు నిధి రజ్దాన్‌తో వివాహం
Graduates Registration | గ్రాడుయేట్ల ఓటు నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలి : మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి
Yash | నిజ జీవితంలో నేను రాముడిని.. తెరపై రావణుడిని: యశ్ ఆసక్తికర వ్యాఖ్యలు!
Kagiso Rabada | టెస్ట్ క్రికెట్లో చరిత్ర సృష్టించిన రబాడా.. తక్కువ బంతులేసి ఎక్కువ వికెట్లు పడగొట్టిన బౌలర్‌గా రికార్డు..!
ట్రెండింగ్ వార్తలు
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?

