Dhurandhar 2 | బాలీవుడ్ స్టార్ హీరో రణ్వీర్ సింగ్, దర్శకుడు ఆదిత్య ధర్ కాంబినేషన్లో వచ్చిన ధురంధర్ సినిమా గురించి ప్రస్తుతం సోషల్ మీడియాలో భారీ చర్చ నడుస్తోంది. ఈ సినిమా విడుదలైన తర్వాత ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించిందనే ప్రచారంతో పాటు, ఓటీటీ విడుదల తర్వాత కూడా అంతర్జాతీయ స్థాయిలో భారీ ఆదరణ దక్కుతోందని వార్తలు వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా ధురంధర్ 2: ది రివెంజ్ థియేటర్లలో విడుదలైన తర్వాత బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించిందనే ప్రచారం సినీ వర్గాల్లో వినిపిస్తోంది. కలెక్షన్ల పరంగా పలు రికార్డులను బద్దలు కొట్టిందని, అనేక ప్రాంతాల్లో మంచి విజయాన్ని అందుకుందని అభిమానులు సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు.
ఇక ఇటీవల ఈ సినిమా ఓటీటీకలోకి అందుబాటులోకి వచ్చిన తర్వాత విదేశీ ప్రేక్షకుల నుంచి కూడా విశేష స్పందన వస్తోందని ప్రచారం సాగుతోంది. ముఖ్యంగా కొన్ని దేశాల్లో ఈ సినిమాపై భారీ ఆసక్తి కనిపించిందని, ప్రేక్షకులు పెద్ద సంఖ్యలో వీక్షిస్తున్నారనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ సినిమాకు సంబంధించిన చర్చల్లో మరో ఆసక్తికర అంశం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇటీవల ఈ చిత్రాన్ని ఓటీటీ వేదికపై ఇతర దేశాల్లో స్ట్రీమింగ్కు అందుబాటులోకి తీసుకు రాగా, ఈ జాబితాలో పాకిస్థాన్ కూడా ఉండటంతో అక్కడి ప్రేక్షకుల స్పందనపై ప్రత్యేక చర్చ మొదలైంది. సాధారణంగా దేశభక్తి నేపథ్యంలో తెరకెక్కే చిత్రాల్లో భారత్-పాకిస్థాన్ అంశాలు ప్రధానంగా కనిపిస్తుంటాయి. ఈ సినిమా సిరీస్‌లో కూడా అలాంటి అంశాలు ఉన్నప్పటికీ, పాకిస్థాన్ ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభిస్తోందని సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అవుతున్నాయి.
అంతేకాకుండా, సినిమా చూడటానికి ఒకేసారి పెద్ద సంఖ్యలో ప్రేక్షకులు ఆసక్తి చూపడంతో భారీ ట్రాఫిక్ నమోదైందని, దీనివల్ల కొన్ని సాంకేతిక సమస్యలు తలెత్తాయనే ప్రచారం కూడా సాగుతోంది. అయితే ఈ అంశాలపై సంబంధిత ఓటీటీ సంస్థ నుంచి ఎలాంటి అధికారిక ధృవీకరణ వెలువడలేదు. మరోవైపు, స్థానిక చిత్రాలతో పోల్చినా ఈ సినిమాపై ప్రేక్షకుల ఆసక్తి ఎక్కువగా కనిపిస్తోందని సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది. సరిహద్దులు వేరైన, మంచి కంటెంట్‌కు ప్రేక్షకుల ఆదరణ ఎక్కడైనా ఒకేలా ఉంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం ఈ అంశం సినీ అభిమానుల్లో ఆసక్తికర చర్చగా మారింది.సినిమా కంటెంట్, యాక్షన్ సన్నివేశాలు, నటీనటుల ప్రదర్శనపై ప్రేక్షకులు ప్రశంసలు కురిపిస్తున్నారని సోషల్ మీడియాలో పోస్టులు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా రణ్వీర్ సింగ్ నటన, ఆదిత్య ధర్ దర్శకత్వం గురించి పలువురు ప్రశంసిస్తున్నట్లు చర్చ సాగుతోంది.