సీనియర్ సంగీత దర్శకుడు కోటి విలన్‌గా కనిపించబోతున్నాడు. దీపికా, ఆరాధ్య జంటగా రూపొందుతున్న ‘పగ పగ పగ’ అనే చిత్రంలో ఆయన ప్రతినాయకుడిగా, ఓ వైవిధ్యమైన పాత్రను పోషిస్తున్నాడు. రవిశ్రీ దుర్గాప్రసాద్ దర్శకత్వంలో సత్యనారాయణ సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
సంగీత దర్శకుడు కోటి పాత్రకు సంబంధించిన ఫస్ట్‌లుక్‌ను ఇటీవల దర్శకుడు మోహర్ రమేష్ విడుదల చేశారు. ప్రస్తుతం నిర్మాణానంతర పనులను జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని త్వరలోనే విడుదల చేస్తామని నిర్మాత తెలిపారు. ఈ చిత్రానికి సహనిర్మాత: సత్యవతి.