Darshan | మౌనం వీడిన నటుడు దర్శన్ భార్య.. హత్య కేసుపై ఆమె రియాక్షన్ ఏంటంటే..?
Darshan | అభిమాని రేణుకాస్వామి హత్య కేసులో కన్నడ స్టార్ యాక్టర్ దర్శన్ (Darshan)తోపాటు నటి పవిత్రగౌడను పోలీసులు అదుపులోకి తీసుకున్నారని తెలిసిందే. అయితే చాలా రోజుల తర్వాత ఈ వ్యవహారంపై దర్శన్ భార్య విజయలక్ష్మి మౌనం వీడింది.
Darshan | హత్యకేసులో పాపులర్ కన్నడ స్టార్ యాక్టర్ దర్శన్ (Darshan) అరెస్ట్ అవడం సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారిన విషయం తెలిసిందే. చిత్రదుర్గకు చెందిన అభిమాని రేణుకాస్వామి హత్య కేసులో దర్శన్‌తోపాటు నటి పవిత్రగౌడను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ వ్యవహారంపై ఇప్పటికే నటి రచితా రామ్ (Rachita Ram) స్పందిస్తూ.. రేణుకాస్వామి ఆత్మకు శాంతి చేకూరాలని, ఆయన కుటుంబానికి మనోధైర్యాన్ని అందించాలని ఆ భగవంతుడిని కోరుకుంటున్నట్టు పేర్కొంది. హత్య కేసులో సరైన న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నా.
దర్శన్ ఇలాంటి హత్య కేసులో ఉన్నారంటే నమ్మశక్యం కావడం లేదంది రచితా రామ్. అయితే చాలా రోజుల తర్వాత దర్శన్ భార్య విజయలక్ష్మి మౌనం వీడింది. దర్శన్‌పై వచ్చిన హత్యారోపణలపై విజయలక్ష్మి తొలిసారి స్పందించింది. హత్య కేసుపై అనధికారిక సమాచారాన్ని ప్రచురించకుండా మీడియా సంస్థలపై సెషన్స్ కోర్టు జారీ చేసిన నిషేధాన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో అందరితో షేర్ చేసుకుంటూ.. హత్యకు గురైన రేణుకాస్వామి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేసింది విజయలక్ష్మి.
దర్శన్ కోసం గత కొన్ని రోజులుగా నేను, నా కొడుకు, దర్శన్ స్నేహితులు, కుటుంబం, అభిమానులందరూ వేదనతో ఉన్నాం. ఈ కేసుకు సంబంధించిన మీడియా, నెటిజన్లు అనధికార సమాచారాన్ని షేర్ చేయడం, అబద్దాలను ప్రచారం చేయడం ఆపుతారని ఆశిస్తున్నానని రాసుకొచ్చింది. రేణుకాస్వామి హత్య కేసులో మొత్తం 17 మంది నిందితులుండగా.. కొందరిని పోలీసులు అరెస్ట్ చేశారు. మరికొందరు పోలీసుల ఎదుట లొంగిపోయారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

