Mega Success | మెగా విక్టరీ బ్లాక్ బస్టర్.. ‘మన శంకర వరప్రసాద్ గారు’ సక్సెస్ సంబరాల్లో చిరంజీవి, వెంకటేష్!
Mana Shankara Vara Prasad Garu | మెగాస్టార్ చిరంజీవి నటించిన లేటెస్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘మన శంకర వరప్రసాద్ గారు’ సంక్రాంతి బరిలో నిలిచి బాక్సాఫీస్ వద్ద విజృంభిస్తోంది.
Mega Victory Success | మెగాస్టార్ చిరంజీవి నటించిన లేటెస్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘మన శంకర వరప్రసాద్ గారు’ సంక్రాంతి బరిలో నిలిచి బాక్సాఫీస్ వద్ద విజృంభిస్తోంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం జనవరి 12న విడుదలై కేవలం రెండు రోజుల్లోనే రూ. 120 కోట్ల క్లబ్లో చేరి రికార్డు సృష్టించింది. ఈ భారీ విజయాన్ని పురస్కరించుకుని మెగాస్టార్ చిరంజీవి తన నివాసంలో చిత్ర బృందానికి ఘనంగా పార్టీ ఇచ్చారు.
ఈ వేడుకలో విక్టరీ వెంకటేష్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ సినిమాలో వెంకటేష్ ‘వెంకీ గౌడ’ అనే పవర్ఫుల్ క్యామియో పాత్రలో నటించి ప్రేక్షకులను అలరించారు. సక్సెస్ సెలబ్రేషన్స్‌లో చిరంజీవి, వెంకటేష్ మరియు అనిల్ రావిపూడి కలిసి కేక్ కట్ చేసి సంతోషాన్ని పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా పాల్గొని సందడి చేశారు. ఈ చిత్రానికి చిరంజీవి కుమార్తె సుస్మిత కొణిదెల నిర్మాతగా వ్యవహరించడం విశేషం. అనిల్ రావిపూడి మార్క్ కామెడీ, చిరంజీవి గ్రేస్ మరియు వెంకటేష్ స్పెషల్ ఎంట్రీ తోడవ్వడంతో థియేటర్లు హౌస్‌ఫుల్ కలెక్షన్లతో కళకళలాడుతున్నాయి. ‘మెగా విక్టరీ బ్లాక్ బస్టర్’ అంటూ అభిమానులు సోషల్ మీడియాలో ఈ ఫోటోలను వైరల్ చేస్తున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

